పొగ‌రుమోతు అత్తల క‌థేమి?

Last Updated on by

నాటి మేటి క‌థానాయిక వాణిశ్రీ అన‌గానే అత్త పాత్ర‌లు గుర్తుకు రావాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `అత్త‌కు య‌ముడు- అమ్మాయికి మొగుడు` చిత్రంలో వాణిశ్రీ న‌ట‌న అద్వితీయం. ఆ త‌ర్వాత యువ‌సామ్రాట్ నాగార్జున న‌టించిన `అల్ల‌రి అల్లుడు` చిత్రంలోనూ అదే త‌ర‌హాలో గ‌ర్విష్ఠి అయిన‌ అత్త‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభ‌న్‌బాబు వంటి మేటి క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించిన వాణిశ్రీ ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ రాణించారు.

అదంతా అటుంచితే వాణిశ్రీ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? అంటే .. ఇప్ప‌టికీ త‌ను హైద‌రాబాద్ ర‌వీంద్ర భార‌తి, త్యాగ‌రాయ గాన‌స‌భ‌ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. స‌భ‌లు, స‌త్కారాలు, స్పీచ్‌లతో బ్యాలెన్స్ లైఫ్‌ని ధార్మికంగా గ‌డిపేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే వాణిశ్రీ‌కి మ‌రోసారి అత్త పాత్ర‌ల్లో ఆఫ‌ర్ వస్తే న‌టించే ఛాన్సుందా? అంటే లేక‌నే అక్కినేని నాగ‌చైత‌న్య `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రంలో ఛ‌రిష్మాటిక్ అత్త ర‌మ్య‌కృష్ణ‌ను ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వాణి శ్రీ రేంజు అత్త‌గా ర‌మ్య శైల‌జారెడ్డి పాత్ర‌లో రాణిస్తారా? లేదా? అన్న‌ది చూడాలి. శైల‌జారెడ్డి అల్లుడు ఈనెలాఖ‌రున రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments