న‌య‌న్ ల‌వ్ స్టోరీల‌పై ఇమంది వ్యాఖ్య‌లు!

న‌య‌న‌తార మూడు ల‌వ్ స్టోరీల గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో శింబుతో అటుపై ప్ర‌భుదేవా..అక్క‌డా బెడిసి కొట్ట‌డంతో ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ తో కార్య‌క‌లాపం న‌డిపిస్తోంది. అయితే సీనియ‌ర్ పాత్రికేయుడు ఇమంది రామారావు న‌య‌న్ గురించి ఓ ఇంట‌ర్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే!

వాస్త‌వానికి శింబును న‌య‌న్ పెళ్లి చేసుకోవాల‌నుకుందిట‌. కానీ శింబు ఒప్పుకోక‌పోవ‌డంతో జ‌ర‌గ‌లేద‌న్నారు. శింబు తండ్రి కూడా న‌య‌న తార అనే సరికి నో అన్నాడుట‌. ఇక ప్ర‌భుదేవాతో పెళ్లి పీఠ‌ల వ‌ర‌కూ వెళ్లి వెన‌క్కి రావ‌డానికి కార‌ణం ప్ర‌భుదేవా భ‌ర్య అట‌. త‌న భ‌ర్త రెండ‌వ పెళ్లిచేసుకుంటే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి చ‌నిపోతాన‌ని బెదిరించిందిట‌. అందుకే ఆ పెళ్లి జ‌ర‌గ‌లేదుట‌. ప్ర‌భుదేవాకు న‌య‌న్ కొన్ని ఆస్తులు కూడా ఇచ్చిందిట‌. ఆయ‌న పెట్టిన కండీష‌న్లు అన్నింటికి ఒప్పుకుంద‌ట‌. కానీ కాలం మ‌రో మార్గం చూపించ‌ద‌న్నారు. అలాగే విఘ్నేష్ శివ‌న్ తో పెళ్లి జ‌రుగుతుంది? అన్న దాంట్లోనూ గ్యారెంటీ లేదన్నారు. ఇన్ని ఎదురు దెబ్బ‌లు తిని ఏ హీరోయిన్ మ‌ళ్లీ సినిమాల్లో రాణించ‌లేదు. కానీ న‌య‌నతార గుండె గ‌ట్టింది. ప‌డి లేచిన తాచు పాములాంటింది. ఆమె లో ఉన్న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ త‌న‌ను మ‌ళ్లీ నిల‌బెట్టింద‌న్నారు.

Also Read : Two Senior Super Stars Convinced Nayana