అనుప‌మ‌ను కొండెక్కించారు!

Last Updated on by

40ఏళ్ల‌లో చూడ‌లేదు.. కేవ‌లం కొద్దిమందికి మాత్ర‌మే ఇలాంటి పొగ‌డ్త‌లు ద‌క్కుతుంటాయి. నాటి మేటి సీనియ‌ర్ నాయిక‌ల‌తో పోలుస్తూ ఒక యువ‌క‌థానాయిక‌ను పొగిడేయ‌డం అంటే ఆషామాషీనా?   కానీ ఆ పొగ‌డ్త‌లు అందుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ భామ తేజ్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నిర్మాత‌.. 40ఏళ్ల కెరీర్ అనుభ‌వ‌జ్ఞుడు అయిన కె.ఎస్‌.రామారావు అనుప‌మ‌ను ఓ రేంజులో పొగిడేశారు.

నా 40ఏళ్ల కెరీర్‌లో కొంద‌రు క‌థానాయిక‌లు మాత్ర‌మే ఎంతో ప్ర‌త్యేకం. సుహాసిని, రాధిక‌, మీనా వంటి నాయిక‌లు ఎంతోమందితో ప‌ని చేశాను. అనుప‌మ ఆ త‌ర‌హా న‌టి. చక్క‌ని సంస్కారం, స్వ‌చ్ఛ‌త‌, స‌భ్య‌త‌, అంద‌రితో క‌లిసిపోయే స్వ‌భావం నాకు ఎంతో న‌చ్చుతాయి. త‌ను ప్రేమ‌క‌థా చిత్రాలే కాదు. ఎమోషన్స్‌తో బ‌రువైన పాత్ర‌లు చేయ‌గ‌ల‌దు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇక‌పై ఆ కోణంలోనూ త‌న‌కోసం క‌థ‌లు రాయాలి. సీరియ‌స్‌నెస్, ఎమోష‌న్‌, ప‌రిణ‌తి అన్నీ ఉన్న న‌టి త‌ను. తేజ్ చిత్రం ద్వితీయార్థంలో, క్లైమాక్స్‌లో ఎంతో ప‌రిణ‌తితో న‌టించింది… అంటూ కితాబిచ్చారు కె.ఎస్‌.

User Comments