ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ షాక్

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ విష‌యంలో ఎన్నిక‌ల అధికారులు చేతెలెత్తేసిన సెన్సార్ బృందం మాత్రం ఆ సినిమా పై కొర‌డా ఝుళిపించింది. టీడీపీ నాయ‌కులు, తెలుగు త‌మ్ముళ్ల ఆర్త‌నాదాల‌ను ఎన్నిక‌ల అధికారులు ప‌ట్టించుకోక‌పోయినా సెన్సార్ మాత్రం మీకు మేమున్నామంటూ ముందుకొచ్చింది. ఈనెల 22న‌ రిలీజ్ అవ్వాల్సిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వేయాల‌ని, ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ రిలీజ్ చేయ‌కూడ‌దంటూ సెన్సార్ వ‌ర్మ‌కి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. టీడీపీ నాయ‌కులు సెన్సార్ ను విన్న వించుకోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో వ‌ర్మ ఒక్క‌సారిగా సెన్సార్ పై భ‌గ్గుమ‌న్నాడు.

ఏ అధికారం ప్ర‌కారం త‌న సినిమా వాయిదా వేయాలో? కార‌ణం చెప్పాల‌ని డిమాండ్ చేసారు. దీనిపై న్యాయ‌పోరాటం చేస్తాన‌ని ట్వీట్ చేసి చెప్పాడు. తన సినిమాపై కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. అయినా సినిమా లో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు గానీ, వివాదాస్ప‌ద‌ అంశాలు గాని ఉన్నాయా? లేదా? అన్న‌ది రిలీజ్ కు ముందే ఎలా డిసైడ్ చేస్తార‌ని ప్ర‌శ్నించాడు. దీంతో వ‌ర్మ వ‌ర్సెస్ సెన్సార్ మ‌ధ్య బిగ్ ఫైట్ త‌ప్పేలా లేద‌ని తెలుస్తోంది. గ‌తంలో వ‌ర్మ‌ సెన్సార్ తో చాలాసార్లు విబేధాలు తెచ్చుకున్నాడు. దీంతో వ‌ర్మ పై క‌క్ష పూరితంగానే ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వ‌ర్మ స‌న్నిహితులు అంటున్నారు.

Also Read: RGV’S Promotional Strategy For Lakshmi’s Ntr