రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్

రాంగోపాల్ వర్మ వర్మ మరో సంచలనానికి తెర లేపాడు. కమ్మ రాజ్యంలో కడపరెడ్లు కి సీక్వెల్ గా రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ అనే టైటిల్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మరి ఈ ఐడియా వర్మకి ఎలా తట్టింది? తనకు తానే అల్లిన టైటిలా? లేక దీనికి వెనుక ఓ ప్రేరణ ఉందా? అంటే రెండవది ఖరారు చేసుకోవాలంటున్నాడు. ఇటీవల టీడీపీ కి రాజీనామా చేసి వల్లభనేని వంశీ వైకాపా తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీని బయటకు వస్తూనే టీడీపీ నేతలపై నిప్పులు చెరిగాడు. మాజీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా లోకేష్ ను వదిలి పెట్టలేదు. ఇద్దర్నీ పేర్లు పెట్టి మరీ విమర్శించి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాడు.

అంతకు ముందు ఆ పార్టీ నాయకులను తనదైన శైలిలో దూషించాడు. ఇంకా పలువురు నేతలు, నాయకులు టీడీపీ బైబై చెప్పి వైకాపా కండువా కప్పుడున్నారు. దీంతో వంశీ పేరు సహా మిగతా నాయకులు తెలుగు రాష్ర్టాల్లో సంచలనమయ్యారు. ఇప్పుడా సంచలనాన్నే వర్మ కథా వస్తువుగా మలచబోతున్నాడు. ఆ పార్టీని వీడి వైకాపాను సపోర్ట్ చేస్తోన్న కొంత కమ్మనాయకుల తీరును వర్ణిస్తూ రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ అంటూ ఓ ట్వీట్ వదిలాడు. ఇదే కమ్మరాజ్యంలో కడపరెడ్లు కు సీక్వెల్ అని రాసిపెట్టుకోండి అన్నాడు. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో తాజా పరిస్థితులు, వర్మ కొత్త టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.