సెవెన్ ద‌ర్శ‌కుడు నిజార్ ఇంట‌ర్వ్యూ

తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన ‘సెవెన్’తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ సినిమా ప్రీమియర్ షోలు బుధవారం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిజార్ షఫీతో ఇంటర్వ్యూ

మాది చెన్నై. ఎంజిఆర్ గ‌వ‌ర్న‌మెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌కి డైరెక్షన్ కూడా చేశాను. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తి శరవణన్ గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్ గా చేశా. తర్వాత తమిళంలో మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. అందులో సత్యరాజ్ గారు నిర్మించిన సినిమా ‘నాయిగల్ జాకిరతై’ ఒకటి. వాళ్లబ్బాయి శిబిరాజ్ హీరోగా నటించారు. ఆ సినిమా కెమెరా వర్క్ మారుతిగారికి నచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’కి వర్క్ చేద్దామని పిలిచారు. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాను. ‘సెవెన్’తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.

ఒక రోజు హవీష్ ఫోన్ చేశారు. ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా. లేదు. దర్శకుడిగా మారాలనే ఆలోచన నాలో ఉంది. అయితే, ఇంత త్వరగా దర్శకుణ్ణి అవుదామని అనుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవాలని అనుకున్నా. అయితే ముందు చెప్పినట్టు మంచి స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఎందుకు మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా. సినిమాటోగ్రఫీ ప‌రంగానూ మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. నైట్ ఎఫెక్ట్స్, థ్రిల్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. ఒక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెహమాన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. హీరో కార్తీక్, ఆరుగురు హీరోయిన్లు. రెహమాన్ దృష్టిలో ఏడుగురు. అదే ‘సెవెన్’.లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. ప్రేమకథలో లిప్ కిస్సులు కూడా భాగమే. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం అలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్ లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. రొమాన్స్, థ్రిల్ సీన్స్… సినిమాలో రెండూ ఉంటాయి. సినిమాను ఆరు రీళ్ళుగా విభజిస్తే… రీలుకు ఒక హీరోయిన్ చొప్పున వస్తారు. ప్రతి ఒక్కరికీ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి కథ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అందరూ తమ తమ పాత్రల్లో బాగా చేశారు. రత్నవేలుగారు చాలా సంతోషపడ్డారు. ట్రైలర్లు, పాటలు పంపించాను. బావున్నాయని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ చేస్తున్నారు. అది పూర్తయిన తరవాత సినిమా చూస్తానని చెప్పారు. మారుతి కూడా ఎంతో సంతోషించారు. ట్రైలర్లు, పాటల గురించి చాటింగ్ చేసేవారు.