ఏక్తాకు అడ‌ల్ట్ ఇష్ట‌మంట‌

Last Updated on by

ఏక్తాక‌పూర్ అంటేనే బాలీవుడ్ లో ఓ ఇమేజ్ ఉంది. ఆమె A స‌ర్టిఫికేట్ సినిమాలు త‌ప్ప మ‌రేం చేయ‌ద‌ని. అమ్మాయి అయినా కూడా సెక్స్ అనే ప‌దాన్ని ఏ మాత్రం సిగ్గు ప‌డ‌కుండా ప‌ది మందిలో ప‌లుకుతుంది ఏక్తా. ఆమె తీసే సినిమాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇక ఇప్పుడు ఈమె నిర్మించిన వీరి ది వెడ్డింగ్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈ చిత్రం శశాంక్ ఘోష్ తెర‌కెక్కించాడు. జూన్ 1న విడుద‌ల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర సెన్సార్ ఇష్యూపై చిన్న గొడ‌వ జ‌రుగుతుంది. A స‌ర్టిఫికెట్ కాకుండా వేరేది వ‌చ్చుంటే బాగుండు అని. కానీ ఏక్తా క‌పూర్ మాత్రం యిజం సినిమాలో క‌ళ్యాణ్ రామ్ మాదిరి ఏం ప‌ర్లేదు.. ఏం ప‌ర్లేదు అంటుంది.

A స‌ర్టిఫికేట్ అయితే వ‌చ్చే న‌ష్టమేం లేదు.. తాను కూడా ఓ అమ్మాయినే.. ఓ మ‌నిషినే కాబ‌ట్టి మంచి సినిమాలే చేస్తాను అంటుంది. పైగా వీరి ది వెడ్డింగ్ సినిమా కేవ‌లం కామెడీ సినిమానో.. రొమాన్స్ కాద‌ని అదో జీవితం అని చెబుతుంది ఈ అడ‌ల్ట్ నిర్మాత‌. మ‌రి ఏక్తా చెప్పిన మాట‌ల్ని ప్రేక్ష‌కులు ఎంత‌వ‌ర‌కు న‌మ్ముతారు..? ఈ A స‌ర్టిఫికేట్ సినిమాను ఎంత వ‌ర‌కు ఆద‌రిస్తారు..? మ‌రోవైపు అదే రోజు సోన‌మ్ కపూర్ త‌మ్ముడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ న‌టించిన భావేష్ జోషి కూడా విడుద‌ల కానుంది. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో..!

User Comments