లేగ లేడి పిల్లలా..

Last Updated on by

లేగ లేడి పిల్ల‌లా.. అప్పుడే పుట్టిన జింక పిల్ల‌లా ఎంత అమాయ‌కంగా చూస్తోందో ఈ ముంబై బొమ్మ‌. చూసేందుకు ఎంతో అమాయ‌కంగా క‌నిపిస్తున్నా కుర్ర‌కారు గుండెల్ని క‌స‌క‌సా కోసేయ‌డంలో ఈ అమ్మ‌డిని కొట్టేవాళ్లే లేరు. చూపుల‌తోనే సుర‌సుర మంట‌లు పుట్టించ‌డం పూజా హెగ్డేకి తెలిసినంత‌గా వేరొక‌రికి తెలీదేమో?

ఇప్ప‌టికిప్పుడు ఎన్టీఆర్‌, మ‌హేష్, ప్ర‌భాస్ వంటి టాప్ హీరోల‌తో న‌టించేస్తూ ఆయా హీరోల గుండెల్లోనూ మంట‌లు రాజేస్తోంది. అమాయ‌కంగా క‌నిపిస్తోంది.. కొంటెగా క‌వ్విస్తుంది. ఆ ప్ర‌త్యేక‌త‌, విల‌క్ష‌ణ‌త ఉంది కాబ‌ట్టే పూజా కెరీర్ వెనుదిరిగి చూసుకున్న‌దే లేదు. వ‌రుణ్‌తేజ్‌, బ‌న్ని, నాగ‌చైత‌న్య వంటి స్టార్లు వెంట‌ప‌డి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు త‌న‌కు తానుగానే అవ‌కాశాలు అందుకుంటోంది. ఈ అమ్మ‌డి వ‌రుస చూస్తుంటే మునుముందు మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ల‌కు కూడా ఆల్ట‌ర్నేట్ నాయిక‌గా ఎదిగేస్తుందేమో అనిపిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్‌లోనూ ప‌లు క్రేజీ చిత్రాల‌కు సంత‌కాలు చేసే ప‌నిలో ఉంది పూజా.

User Comments