సాహో మేకింగ్1: కార్లు నుజ్జు నుజ్జు

కార్లు గాల్లో ప‌ల్టీలు కొట్ట‌డం.. గాల్లోనే గింగిరాలు తిరిగి కింద ప‌డ‌డం.. ఒక కార్‌పై ఇంకో కార్ లంఘించ‌డం.. భారీ కంటెయిన‌ర్ నుంచి ఒక‌దాని వెంట ఒక‌టిగా కార్‌లు ర‌న్నింగ్ రేస్‌లోకి వ‌చ్చి భీక‌ర స‌న్నివేశం క్రియేట్ చేయ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూసిన‌ట్టు ఉండ‌దూ? `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ 5` సినిమాని ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో ప్రివ్యూ వేసిన‌ప్పుడు ప్రోస్సోళ్లు లేచి బాల‌య్య మాస్ డైలాగ్‌కి చ‌ప్ప‌ట్టు కొట్టిన‌ట్టు కొట్టారు. మ‌రి అలాంటి సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేసిన కెన్నీ బేట్స్ `సాహో` చిత్రానికి ప‌ని చేస్తున్నారంటే, ఈ సినిమా ఏ రేంజులో ఉండాలి.

ఆ రేంజును ఆవిష్క‌రించేందుకే నేటి ప్ర‌భాస్ బ‌ర్త్ డే వ‌ర‌కూ వేచి చూసింది టీమ్. నేడు `షేడ్స్ ఆఫ్ సామో చాప్ట‌ర్ 1` పేరుతో ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. అబూద‌బీలో 30రోజుల పాటు భారీ హైవేల్లో, వంతెన‌ల‌పైనా యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించేందుకు కెన్నీ బేట్స్ అండ్ టీమ్ ఏం చేశారో ఈ వీడియోలో చూపించారు. భారీ క్రేన్లు, రియ‌ల్ లైవ్ కంటెయిన‌ర్లు, భారీ బైక్ ఛేజ్‌లు చూస్తుంటేనే మ‌తి చెడాల్సిందే అన్న తీరుగా ఈ వీడియో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పండుగ చేసింద‌నే చెప్పాలి. మేకింగ్ క్లిప్ క్లైమాక్స్‌లో డార్లింగ్ ఇచ్చిన ఎంట్రీ ఫెంటాస్టిక్. ఆర‌డుగుల ఆజానుభాహుడు ఇంట‌ర్నేష‌న‌ల్ లుక్‌లో, యూనివ‌ర్శ‌ల్ అప్పీల్‌తో క‌నిపించి మైమ‌రిపించాడు. చాప్ట‌ర్- 1లోనే ఇంత ఉంటే, చాప్ట‌ర్ -2లో మునుముందు రిలీజ్ చేయ‌బోతున్న మేకింగ్ వీడియోల్లో, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ప్ర‌భాస్ ఏ రేంజులో క‌నిపించ‌బోతున్నాడో అన్న ఉత్కంఠ పెరిగింది. సాహో 2019 స‌మ్మ‌ర్‌కి మోస్ట్ అవైటెడ్ మూవీ అన‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ఈ మేకింగ్ వీడియో చెబుతోంది. ముఖ్యంగా యు.వి.క్రియేషన్స్ రాజీ లేని పెట్టుబ‌డి విజువల్స్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకి అభిమానుల‌కు ఇది సిస‌లైన గిఫ్ట్ అనే చెప్పాలి.