శ్రీరెడ్డి వెన‌క షాడో?

Last Updated on by

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నందమూరి బాల‌కృష్ణ‌పై ఎటాక్ మొదలు పెట్ట‌డంతో ఇరు ఫ్యామిలీ అభిమానుల మధ్య వార్ పీక్స్ లో జ‌రుగుతోంది. నిన్న‌టి రోజున మెగాభిమానులే క‌థానాయ‌కుడు థియేట‌ర్ వ‌ద్ద ఫ్రీగా టిక్కెట్లు పంచడంతో రచ్చ మ‌రింత ముదిరింది. బాలయ్య‌ను కించప‌ర‌చ‌డానికి మెగా ఫ్యాన్స్ ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని బాల‌య్య ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. ఈరోజు మీది..రేపు మాది! మీ హీరో సంగతేంటో మేము చూస్తామంటూ వి.విఆర్ ను ఉద్దేశించి వార్ షురూ చేసారు. శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన విన‌య విధేయ రామ విడుద‌ల‌వుతోన్న నేప‌థ్యంలో బాల‌య్య అభిమానులు ఎటాక్ దిగ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తోంది.

అటు ఏపీలో జ‌న‌సేన‌-టీడీపీల మ‌ధ్య వార్ సైతం ప‌తాక స్థాయికి చేరుకోవ‌డంతో ఇండ‌స్ర్టీ సైతం రెండు వ‌ర్గాలు గా చిలీపోయే స‌న్నివేశం క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఓ వ‌ర్గం అంతా ఒకేతాటిపైకి వ‌చ్చిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు మొద‌లయ్యాయి. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి శ్రీరెడ్డి ఇచ్చింది. కొన్ని నెల‌లు పాటు కామ్ గా ఉన్న అమ్మ‌డు ఉన్న‌ట్లుండి ఊడిప‌డింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ఫ్యామిలీని మ‌రోసారి టార్గెట్ చేసింది. నంద‌మూరి ఫ్యామిలీకి బాకా కొడుతూ..మెగా ఫ్యామిలీని ఎండ‌గ‌ట్టే ప‌నిపెట్టుకుంది. నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ వేస్తూ, బాల‌య్య‌కు మ‌ద్ద‌తు తెలిపింది. జ‌బ‌ర్ ద‌స్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులుక‌న్నా? బాల‌య్య ఎక్కువ ఏం మాట్లాడంటూ నాగ‌బాబుపై సెటైర్లు గుప్పించింది. మెగా ఫ్యామిలీ వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ వెలు పెట్టి కెలికే ప్ర‌య‌త్నం చేసింది. మ‌రి ఇన్నాళ్లు సైటెంట్ గా ఉన్న శ్రీరెడ్డి స‌డెన్ ఎంట్రీ కి కార‌ణం ఏంటి అంటే? ఆమె వెనుకు ఓ వ‌ర్గం ఉండి గేమ్ ప్లాన్ చేసార‌నే మ‌రో వార్త కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ శ్రీరెడ్డి వెన‌క షాడో ఎవ‌రు? చౌద‌రి గారా? లేక రెడ్డిగారేనా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments