అర్జున్ రెడ్డి.. ఆ హీరోనే చేయగలడు

Last Updated on by

అద్భుతం జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రూ గుర్తించ‌రు.. జ‌రిగిన త‌ర్వాత గుర్తించాల్సిన అవ‌స‌రం లేదు. అదేదో సినిమాలో త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్ ఇది. అర్జున్ రెడ్డి సినిమాకు ఇది అచ్చు గుద్దిన‌ట్లుగా స‌రిపోతుంది. ఏడాదికి 200 సినిమాలు వ‌చ్చే ఇండ‌స్ట్రీలో.. ది బెస్ట్ గా నిల‌బ‌డాలంటే దానికి ఎన్నో క్వాలిటీస్ ఉండాలి.. పైగా చిన్న సినిమా అనే ముద్ర కూడా చెరిపేసుకుని.. ట్రెండ్ సెట్ట‌ర్ అనే కొత్త ట్యాగ్ లైన్ త‌గిలించుకుంది అర్జున్ రెడ్డి. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా నిలిచింది అర్జున్ రెడ్డి. అడ‌ల్ట్స్ ఓన్లీ అంటూ వ‌చ్చిన ఈ చిత్రం 26 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇక రీమేక్ రైట్స్.. శాటిలైట్ అన్నీ క‌లిపితే మ‌రో 10 కోట్ల‌ వ‌ర‌కు వ‌చ్చాయి. అంతా చేస్తే ఈ చిత్రం బ‌డ్జెట్ 3 కోట్ల‌కు మించ‌లేదు. అంటే నిర్మాత‌ల‌కు ప‌దిహేను రెట్లు లాభం. దీన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ అనాలో.. బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనాలో తెలియ‌దు మ‌రి.

ఈ చిత్రం ఇప్ప‌టికే త‌మిళ‌నాట బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ ఇందులో హీరో. ఇక ఇదే సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్ లో ముందు ర‌ణ్ వీర్ సింగ్ అనుకున్నారు.. త‌ర్వాత‌ అర్జున్ క‌పూర్ వ‌చ్చాడు.. ఇప్పుడు ఈయ‌న స్థానంలో షాహిద్ క‌పూర్ వ‌చ్చాడు. హిందీలోనూ ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగానే తెర‌కెక్కించ‌బోతున్నాడు. అక్క‌డ ఇంకా రా మెటీరియ‌ల్ గా తెర‌కెక్కించ‌నున్నాడు సందీప్. ఈ చిత్రాన్ని మురాద్ ఖేతాని.. అశ్విన్ వార్డే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాకు షాహిద్ క‌పూర్ లాంటి హీరో తోడైతే సినిమా పిచ్చెక్కించ‌డం ఖాయం. గ‌తంలో క‌మీనా.. ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాల్లో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర్చాడు షాహిద్. ఇప్పుడు అర్జున్ రెడ్డిగా మార‌బోతున్నాడు. తెలుగులో సెన్సార్ కోసం వ‌దిలేసిన కొన్ని సీన్స్ హిందీలో మ‌రింత రా.. గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

User Comments