జీరో ఈద్ స‌ర్‌ప్రైజ్‌

Last Updated on by

కింగ్‌ఖాన్ షారూక్ గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్టు లేక త‌డ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌డ‌బాటు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అత‌డు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. 2016 -17 సీజ‌న్ అత‌డికి ఎంత‌మాత్రం క‌లిసి రాలేదు. ఆ క్ర‌మంలోనే 2017 చివ‌రిలో ఓ అసాధార‌ణ ప్ర‌య‌త్నం మొద‌లెట్టాడు. అదే జీరో. ఈ సినిమాలో షారూక్ తొలిసారి ఓ మ‌రుగుజ్జు పాత్ర‌తో సాహ‌సమే చేస్తున్నాడు. స్నేహితుడు ఆనంద్‌.ఎల్‌.రాయ్ పై న‌మ్మ‌కంతో ఈ క్రేజీ ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టును చేప‌ట్టాడు. ఈ చిత్రంలో షారూక్ క‌థానాయిక వెంట‌ప‌డే మ‌రుగుజ్జు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అందాల క‌థానాయిక‌గా అనుష్క శ‌ర్మ న‌టిస్తోంది. క‌త్రిన‌కైఫ్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తోంది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21 ఈ చిత్రం రిలీజ్ కానుంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. ఇక‌పోతే ఈ చిత్రంలో ఎవ‌రూ ఊహించ‌ని ధ‌మాకా ప్లాన్ చేశాడు షారూక్‌.

ఇందులో ఓ అతిధి పాత్ర‌లో కండ‌ల హీరో స‌ల్మాన్‌ఖాన్ ద‌ర్శ‌న‌మీయ‌నున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి డ్యాన్సులాడే టీజ‌ర్‌ని ఈ ఈద్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. కేవ‌లం సల్మాన్ మాత్ర‌మే కాదు.. మ్యాడీ అలియాస్ మాధ‌వ‌న్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. అల‌బామాలో షారూక్ – మాధ‌వ‌న్ కాంబోపై ఇప్ప‌టికే కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఆలియాభ‌ట్, శ్రీ‌దేవి, క‌రిష్మా క‌పూర్‌, కాజోల్ వంటి స్టార్లు అతిధులుగా మెరుపులు మెరిపించ‌నున్నారు. ఇక‌పోతే డిసెంబ‌ర్ షారూక్‌కి ఏ రేంజులో క‌లిసొస్తుందో చూడాలి. ఇదివ‌ర‌కూ ఓ చిన్న టీజ‌ర్‌తో ఇచ్చిన గ్లింప్స్ జీరో సినిమా ఆద్యంతం ఇవ్వ‌గ‌లిగితే కింగ్‌ఖాన్ బాక్సాఫీస్ వ‌ద్ద విన్ అవుతాడు. స‌క్సెస్ దారిలోకొస్తాడు!


Related Posts