గారాల ప‌ట్టీ పెళ్లిపై డాడ్ మాట‌

Last Updated on by

అందాల క‌థానాయిక శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. ఓవైపు ప్ర‌భాస్ స‌ర‌స‌న `సాహో` చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్‌లో వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. అక్క‌డ 100 కోట్ల క్ల‌బ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న `బ‌ట్టి గుల్ మెహ‌ర్ చాలు` చిత్రంలో న‌టిస్తోంది. ఇదేగాక మ‌రోవైపు సైనా నెహ్వాల్ జీవిత‌క‌థ‌లో న‌టించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్ని సినిమాల‌తో బిజీగా ఉన్న శ్ర‌ద్ధా క‌పూర్ ఇప్ప‌టికిప్పుడు పెళ్లికి రెడీ అవుతోంద‌న్న పుకారు షికారు చేస్తోంది.

ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌? అన్న ప్ర‌శ్నకు శ్ర‌ద్ధాక‌పూర్ డాడ్ శ‌క్తిక‌పూర్ ఆన్స‌ర్ ఇచ్చారు. శ్ర‌ద్ధా కెరీర్‌లో ఏం చేయాల‌నుకున్నా త‌న‌కు స్వేచ్ఛ‌నిచ్చాను. ఇప్పుడు జీవిత భాగ‌స్వామిని ఎంచుకునే విష‌యంలోనూ త‌న‌కు స్వేచ్ఛ ఉంది. త‌న‌పై ఎఫ‌ర్ల‌కు సంబంధించి బోలెడ‌న్ని వార్తలొచ్చాయి. అవ‌న్నీ విన్నాను. వేరొక వైపు కెరీర్ ప‌రంగా త‌న ఎంపిక‌లు ప‌రిశీలించాను. త‌ను ఏం చేస్తున్నా స్వేచ్ఛ‌గా త‌న జీవితాన్ని మ‌లుచుకుంటోంద‌నే అనిపించింది. అందుకే త‌న మాట‌కు అంతే విలువిస్తున్నాను. కెరీర్ ప‌రంగా శ్ర‌ద్ద మ‌రింత‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు. శ్ర‌ద్ధ ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన కెరీర్‌ని మ‌లుచుకుంటున్న తీరు డాడ్‌కి సంతృప్తిగానే ఉందిట‌.

User Comments