పిక్‌టాక్‌: ర‌ంగుల‌లో క‌లవో

Last Updated on by

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో

ఆమని పూచే యామినివో.. ఆమని పూచే యామినివో
మధుని బాణమో.. మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
రంగులలో కలనై….

ర‌స‌ర‌మ్య‌మైన ఈ పాట‌ గుర్తుకు రావ‌డం లేదూ ఈ ముగ్ధ మ‌నోహ‌రి అంద‌చందాలు వీక్షించాక‌. షాలిని దివ్య రూపం వీక్షించ‌గానే.. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన ఈ పాట చెవుల్లో రింగుమంది. అభినంద‌న చిత్రంలోనిది ఈ గీతం. బాలు, జాన‌కి పాడారు. ఆచార్య ఆత్రేయ మ‌న‌సుకు హ‌త్తుకుపోయే ప‌దాల‌తో గుండెలు పిండేశారు. అయితే ఇదిగో మ‌ళ్లీ అంత‌టి ఉత్ప్రేర‌కంలా క‌నిపిస్తోంది షాలిని. ఆత్రేయ శాశ్వ‌త నిదుర నుంచి.. స‌మాధి నుంచి లేచొచ్చి ఈ అమ్మ‌డి అంద‌చందాల్ని వ‌ర్ణిస్తూ మ‌రోసారి నాటి ప‌ద‌విన్యాసాన్ని లాలిత్యాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తాడేమోననిపిస్తోంది. ఈ న‌ల్ల‌రంగు దుస్తుల్లో ఫోన్ మాట్లాడుతూ మైసూర్ మ‌హారాణికి ప్ర‌తిరూపంలా క‌నిపిస్తోంది. అటు హాలీవుడ్‌కి వెళితే టైటానిక్ హీరోయిన్ క్యాట్ విన్‌స్లెట్‌కి సిస్ట‌ర్ వ‌రుస అనిపిస్తోంది.

Shalini Pandey

User Comments