ప‌ల్ల‌వి కోసం ప‌డిప‌డి లేచే మ‌న‌సు..!

Last Updated on by

సాయిప‌ల్ల‌వి అనే పేరు బ్రాండ్ గా మారిపోయిందిప్పుడు. ఆమె సినిమా ఒప్పుకుంటే చాలు హిట్ అంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. దానికి త‌గ్గ‌ట్లే ఫ్లాప్ లేకుండా జ‌ర్నీ సాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉంటే సాయిపల్ల‌వితో ఒక్క‌సారి న‌టిస్తే మ‌ళ్లీ న‌టించ‌లేరు.. ఆమె చుక్క‌లు చూపిస్తుంది.. షూటింగ్ కు ఆల‌స్యంగా వ‌చ్చి ఇబ్బంది పెడుతుంద‌నే రూమ‌ర్స్ బాగానే ఉన్నాయి. నానితో పాటు నాగ‌శౌర్య‌తో కూడా ఈమెకు ఇదే స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం ఈమెతో శ‌ర్వానంద్ న‌టిస్తున్నాడు. అయితే శ‌ర్వా మాత్రం సాయిప‌ల్ల‌వి వ‌ర్క్ కు ఫిదా అయి పోతున్నాడు.

ప్ర‌స్తుతం హను రాఘ‌వ‌పూడి ప‌డిప‌డి లేచే మ‌న‌సులో హీరోయిన్ గా న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు శ‌ర్వా. ఇదిలా ఉంటే ఈ సినిమాలో న‌టిస్తున్న‌పుడే మ‌రో సినిమాలోనూ ప‌ల్ల‌వితో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. ఈ మ‌ధ్యే నీదినాది ఒకేక‌థ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వేణు ఉడుగుల.. శ‌ర్వానంద్ కు ఓ క‌థ చెప్పి ఒప్పించాడ‌ని తెలుస్తుంది. ఆ మ‌ధ్య నీదినాది ఒకేక‌థ ప్రీ రిలీజ్ కు కూడా శ‌ర్వా వ‌చ్చాడు. ఈ సినిమాలోనూ శ‌ర్వానంద్ కు జోడీగా సాయిప‌ల్ల‌వినే తీసుకుంటున్నారు. మొత్తానికి ప‌ల్ల‌వితో ఒక్క‌సారి న‌టించ‌డ‌మే ఎక్కువ‌ని కొంద‌రు అంటుంటే.. ఈమెతో ఎన్ని సార్లైనా న‌టించొచ్చు అని శ‌ర్వానంద్ లాంటి హీరోలు చెబుతున్నారు. మ‌రి ఈ జోడీ రెండోసారి ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి..!

User Comments