శ‌ర్వానంద్ పడి పడి లేచే మనసు

Last Updated on by

తెలుగులో కొంద‌రు ద‌ర్శ‌కులు ఉన్నారు. వాళ్లు కేవ‌లం త‌మ టైటిల్స్ తోనే ప‌డేస్తుంటారు. ఈ జ‌న‌రేష‌న్ లో అలాంటి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈయ‌న సినిమా టైటిల్స్ అన్నీ చాలా ఆస‌క్తికరంగా ఉంటాయి. అందాల రాక్ష‌సి నుంచి మొద‌లుపెట్టి కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌.. లై.. అంటూ డిఫెరెంట్ వేలో వెళ్తున్నాడు హ‌ను. ఇక ఇప్పుడు ఈయ‌న లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత శ‌ర్వానంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. మార్చ్ 6న శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టైటిల్ విడుద‌ల చేసారు. ప‌డిప‌డి లేచే మ‌న‌సు అనే పొయెటిక్ టైటిల్ ను పెట్టాడు హ‌ను. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శర్వానంద్ చాలా స్టైల్ గా కూర్చొని చాయ్ తాగుతున్నాడు.Sharwanand Sai Pallavi Movie First Look Releasedఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. శ‌ర్వానంద్ ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. కోల్ క‌త్తాలో ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. మే నాటికి షూటింగ్ అంతా పూర్తి కానుంది. ఫిదా, ఎంసిఏ త‌ర్వాత సాయిప‌ల్ల‌వి చేస్తోన్న మూడో తెలుగు సినిమా ఇది. ఈమె సినిమాలో ఉంటే ఖచ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో వ‌చ్చేసింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ త‌న సినిమాకు కూడా ప‌ని చేస్తుంద‌ని న‌మ్ముతున్నాడు శ‌ర్వానంద్. మొత్తానికి.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు ఎలా ఉండ‌బోతుందో..? శ‌ర్వానంద్ కు మ‌రో హిట్ తీసుకొస్తుందో లేదో..? అన్నింటికంటే ముఖ్యంగా లై చేదు జ్ఞాప‌కాల నుంచి హ‌నును ఈ సినిమా బ‌య‌ట ప‌డేస్తుందో లేదో..?

User Comments