శర్వానంద్ ‘శ్రీకారం’ ఫస్ట్ లుక్ వెల్లడి

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీకారం’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చివరి దశ షూటింగ్ జరుగుతోంది.

‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను కిషోర్ బి. డైరెక్ట్ చేస్తున్నారు.

ఈరోజు చిత్ర బృందం ‘శ్రీకారం’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి, వేసవిలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ పోస్టరులో శర్వానంద్ ఇప్పటి దాకా కనిపించని డిఫరెంట్ లుక్ లో, గళ్ల లుంగీ కట్టుకొని, భుజాన నల్లటి కండువా వేసుకొని, వరి పొలాల మధ్య నడచుకొని వెళ్తూ కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన రైతు పాత్రను పోషిస్తున్నాడని ఊహించవచ్చు. అందమైన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తయారవుతున్నదని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. శర్వానంద్ ముఖంలో కాంతి చూస్తుంటే, అతను తన జీవితంలోని ఒక కీలక ఘట్టానికి ‘శ్రీకారం’ చుట్టాడని అనిపిస్తోంది.

Sharwanand Next First Look Poster

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వాళ్లు నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. ఆ సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్ ఈ మూవీకీ వినసొంపైనా బాణీలు కడుతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.

తారాగణం:
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్యా, సప్తగిరి.

సాంకేతిక బృందం:
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

దర్శకత్వం: కిషోర్ బి.