శేఖ‌ర్ క‌మ్ముల కేరాఫ్ తెలంగాణ‌..

ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. తెలుగు ఇండ‌స్ట్రీ మొద‌లై 84 ఏళ్లు పూర్తైపోయాయి. ఇన్నేళ్లలో తెలంగాణ నేప‌థ్యంలో పూర్తి స్థాయి రొమాంటిక్ ప్రేమ‌క‌థ రానే లేదు. కానీ ఈ ఏడాది ఫిదాతో ఆ లోటు తీర్చాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. తెలంగాణ నేప‌థ్యంలో ఇన్నాళ్లూ ఉద్య‌మాలే వ‌చ్చాయి. అస‌లు తెలంగాణ అంటేనే పోరాటాలు.. మావోయిస్టులు అనుకుంటారు. కానీ ఇక్క‌డి ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఫిదా. శేఖ‌ర్ క‌మ్ముల బుర్ర‌లో వ‌చ్చిన ఈ ఐడియా బాక్సాఫీస్ ను కుమ్మేసింది. క‌ల‌లో కూడా ఊహించిన విధంగా ఈ చిత్రం 50 కోట్ల షేర్ కు చేరువ‌గా వ‌సూలు చేసింది.

దాంతో ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల త‌ర్వాతి సినిమా ఏంటి అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ మొద‌లైంది. మొన్న‌టి వ‌ర‌కు లీడ‌ర్ 2 అనుకున్నాడు శేఖ‌ర్. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌న‌సు మారింది. మ‌రోసారి ఫిదా త‌ర‌హాలోనే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు క‌మ్ముల‌. ఎలాగూ ఫిదా 2 చేయాల‌ని ఉంద‌ని గ‌తంలోనే చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌న్నాడు.

అందుకే క‌మ్ముల కూడా ఫిదా 2 కాక‌పోయినా.. మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంలోనే ప్రేమ‌క‌థ రాసుకుంటున్నాడు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను హీరోగా తీసుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈయ‌న్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది ఈయ‌నే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో చిన్న పాత్ర‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు విజ‌య్. ఇక ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల‌తోనే సినిమా చేయ‌బోతున్నాడు. అస‌లే తెలంగాణ యాస‌లో విజ‌య్ తోపు.. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే వ‌చ్చే ఔట్ పుట్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందో..?