తీరాన్ని ఒణికించిన సాగ‌ర‌క‌న్య!

Last Updated on by

అమెరికాపై హ‌రికేన్లు విరుచుకుప‌డ‌తాయ్‌! వైజాగ్‌, కాకినాడ‌పై సునామీ విరుచుకుప‌డుతుంది! అదే మాల్దీవుల‌కు వెళితే.. ఎలాంటి ముప్పు ఉంటుందో తెలుసా? ఇదిగో అక్క‌డ ఏకంగా సాగ‌ర‌క‌న్య నుంచే ఎటాక్ ఉంటుంది. ఆ సంగ‌తి ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. 44ఏళ్ల శిల్పాశెట్టి పొట్టి నిక్క‌రుతో బీచ్ లో చెల‌రేగిపోయిన తీరు చూస్తుంటే.. యూత్‌కి నిదురే క‌రువైంది. ఆ ఫోటోల్ని స‌మాజిక మాధ్య‌మాల్లో అటూ ఇటూ షేర్ చేస్తూ నానా హ‌డావుడి చేస్తున్నారు కుర్ర‌కారు. అన్న‌ట్టు.. పాతికేళ్ల క్రితం శిల్పా ఎంత‌ స‌న్న‌జాజి తీగ‌లా తీరైన‌ ఫిట్‌నెస్‌తో క‌నిపించిందో ఈ ఫోటోల్లో అంతే ఫిట్‌గా క‌నిపిస్తోంది.

సాహ‌స‌వీరుడు-సాగ‌ర‌క‌న్య చిత్రంలో సాగ‌ర‌క‌న్య‌గా క‌నిపించిన శిల్పా అప్పుడు ఎంత యంగ్‌గా ఉందో ఇప్ప‌టికీ అలానే ఉంది. శిల్పా ఓకే చెప్పాలే కానీ, `సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య 2` చిత్రం తెర‌కెక్కిస్తే.. అందులో మ‌రోసారి మ‌త్స్య‌క‌న్య‌గా అల‌రిస్తుందేమో!? ఒక‌వేళ ఆ సినిమాకి క‌థ రాస్తే.. త‌ననే సంప్ర‌దించాలి అనేంత‌గా యంగ్ లుక్‌లో క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం భ‌ర్త రాజ్‌కుంద్రాతో పాటు కుమారుడు కున్‌తో క‌లిసి మాల్దీవుల విహారంలో ఉంది శిల్పా. ఆ క్ర‌మంలోనే ఆన్ లొకేష‌న్ నుంచి ఫోటోల్ని రిలీజ్ చేసింది.

User Comments