మ‌హేష్ కి షిర్డీ బాబా దీవెన‌లు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే టీమ్ భారీగా ప్ర‌చారం సాగిస్తోంది. పోస్ట‌ర్లు లిరిక‌ల్ వీడియోలు టీజ‌ర్ల‌తో వేడి పెంచుతోంది. ఇక జ‌న‌వ‌రి 5న భారీగా ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. అయితే అంత‌కంటే ముందే మ‌హేష్ కుటుంబ స‌మేతంగా ముంబైలో డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ సెల‌బ్రేష‌న్స్ కి ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ గ్యాప్ లోనే మ‌హేష్ – న‌మ్ర‌త బృందం షిర్డీ సాయి బాబాను ద‌ర్శించుకున్నారు. ఈ ద‌ర్శ‌నంలో ఈ బృందంతో పాటుగా మెహ‌ర్ ర‌మేష్ క‌నిపించారు. చిన్నారులు గౌత‌మ్ – సితార బాబా ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఇక ఈ నాలుగైదు రోజుల్ని ముంబైలో స్పెండ్ చేసి తిరిగి మ‌హేష్ ప్రీరిలీజ్ వేడుక‌కు ఎటెండ‌య్యే ఛాన్సుంది. ఆ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.