డార్లింగ్ షాకిచ్చే రూపం

Prabhas

ఒకే ఒక్క సెన్సేష‌న్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌య్యాడు ప్ర‌భాస్. బాహుబ‌లి అత‌డికి కీల‌క మ‌లుపు. ఆ త‌ర్వాత సాహో చిత్రంతో ఊహించ‌ని ప‌రాజ‌యం ఎదురైంది. ఇక సాహో సినిమాలో ప్ర‌భాస్ లుక్ పైనా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొన్నిచోట్ల స్లిమ్ గా ఉన్నా కొన్నిచోట్ల ఫ్యాట్ తో క‌నిపించాడ‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయి.

అయితే ఈసారి అలాంటి త‌ప్పిదం రిపీట్ కాకూడ‌ద‌ని డార్లింగ్ చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. జాన్ సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న ఈ సంద‌ర్భంగా అత‌డు ఓ పెళ్లి వేడుక‌లో స‌ర్ ప్రైజ్ లుక్ తో క‌నిపించాడు. దిల్ రాజు స‌హ‌నిర్మాత క‌జిన్ అయిన ల‌క్ష్మణ్ వార‌సుడు ఉజ్వ‌ల్ పెళ్లిలో క‌నిపించిన ప్ర‌భాస్ పూర్తిగా మారిన రూపంతో క‌నిపించాడు. ఓ మోస్త‌రు బ‌రువు పెరిగి బ్యాలెన్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు. జాన్ సెట్స్ కి వెళ్లే లోగానే రూపంలో ఇక ఇంత‌కంటే మార్పు లేకుండా ఒక పాయింట్ కి ఫిక్స‌య్యి వెళుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్- గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సైరా ఫేం అమిత్ త్రివేది సంగీతం అందించ‌నున్నారు.