కాలా 300కోట్లు తేవాలా?

Last Updated on by

సైలెన్స్ త‌ర‌వాత సునామీలా దూసుకొస్తేనే ఏ స్టార్ హీరోకి అయినా ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కేది. ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ స‌న్నివేశ‌మదే. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు.. ట్రేడ్‌లో నెగెటివ్ టాక్ నేప‌థ్యంలో అత‌డు హిట్టు కొడితే స‌రిపోదు. బంప‌ర్ హిట్టు కుద‌ర‌దు.. ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్టే కొట్టాలి. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు న‌మోద‌వ్వాలి. స‌రిగ్గా ఇలాంటి ఛాలెంజింగ్ మూవ్‌మెంట్‌లో ఓ ఫ్లాప్ ద‌ర్శ‌కుడు అన్న ముద్ర ప‌డినా క‌బాలి ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చి ధ‌నుష్ త‌న మామ‌గారు ర‌జ‌నీతో సినిమా తీసి గ‌ట్స్ చూపించారు. అయితే ఆ గ‌ట్స్‌కి త‌గ్గ‌ట్టే `కాలా` ప్రీమియ‌ర్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. అస‌లే ర‌జ‌నీ.. అటుపై హిట్టు అన్న టాక్ వ‌స్తే ఇక అభిమానుల్లో కోలాహాలం మామూలుగా ఉండ‌దు. అందుకే `కాలా` చిత్రం ర‌జ‌నీని ట్రాక్‌లోకి తెస్తుందా? అన్న ఉత్కంఠ స‌ర్వ‌త్రా అభిమానుల్ని నిలువ‌నీయ‌డం లేదు.

మ‌రోవైపు కాలా ప్రీరిలీజ్ బిజినెస్ ఎన్నో ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య సాగినా అదిరిపోయే బిజినెస్ సాగింది. త‌మిళ‌నాడు, మ‌లేషియాలో కాలా బిజినెస్ సూప‌ర్భ్ అన్న టాక్ ఉంది. త‌మిళ‌నాడు – 60 కోట్లు, ఏపీ, నైజాం-33కోట్లు, కేర‌ళ – 10 కోట్లు, ఇండియాలో ఇత‌ర చోట్ల -7 కోట్ల మేర బిజినెస్ సాగించింది. ఓవ‌ర్సీస్ 45 కోట్ల బిజినెస్ క‌లుపుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా 155కోట్ల ప్రీరిలీజ్ థియేట్రిక‌ల్‌ బిజినెస్ సాగింది. క‌ర్నాట‌క‌లో రిలీజైతే, అక్క‌డ బిజినెస్ అద‌నం. శాటిలైట్ హ‌క్కులు వ‌గైరా వ‌గైరా 70 కోట్లు, ఆడియో ఇత‌ర‌త్రా బిజినెస్ 5కోట్లు క‌లుపుకుని కాలా ఓవ‌రాల్‌గా 230 కోట్ల మేర బిజినెస్ చేసింది. అంటే దాదాపు 300కోట్ల మేర వ‌సూలు చేస్తేనే ఈ సినిమా బంప‌ర్‌హిట్ కొట్టిన‌ట్టు. అయితే ర‌జ‌నీ మానియా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేర‌కు సాగుతుంది అన్న‌ది చూడాలి. ఓవైపు క‌ర్నాట‌క‌లో ఈ సినిమా రిలీజ్‌ని అడ్డుకున్నారు. మ‌రోవైపు తెలుగులో ర‌జ‌నీపై పూర్తిగా నెగెటివ్ టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇరు మార్కెట్లు ప్ర‌తికూల‌మైన‌వే. అయితే ప్రీమియ‌ర్ల‌తో వ‌చ్చిన పాజిటివ్ టాక్ కాలాని బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎంత‌వ‌ర‌కూ ముందుకు తీసుకెలుతుందో చూడాలి.

User Comments