2.0 తీసిందెవ‌రో తెలిస్తే షాకే!

Last Updated on by

సెల్‌ఫోన్ నుంచి వెలువ‌డే రేడియోధార్మిక‌త‌ వ‌ల్ల పెను ముప్పు గురించి ఇప్ప‌టికే బోలెడ‌న్ని అధ్య‌య‌నాలు ఉన్నాయి. మనిషి మెద‌డుపైనా, ఇత‌ర‌త్రా జీవ‌న్మ‌ర‌ణ‌ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్న ఈ త‌ర‌హా రేడియో త‌రంగాల ప్ర‌భావంపై గ్రంధాలు ఎన్నో ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయినా మ‌నిషి సెల్‌ఫోన్ లేనిదే జీవించ‌లేడ‌న్న‌ది అంతే క‌ఠోర వాస్త‌వం. ప్ర‌స్తుతం 2.0 రిలీజ్ సంద‌ర్భంగా ఈ టాపిక్ మ‌రోసారి తెర‌పైకొచ్చింది. మొబైల్ కంపెనీల స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జా జీవ‌నాన్ని అత‌లాకుతలం చేసేందుకు వెన‌కాడ‌ని వైనాన్ని 2.0 సినిమా ప్ర‌శ్నిస్తోంది. సెల్లు ఫోన్ వాడ‌కం వ‌ల్ల లోక వినాశ‌నం ఎలా జ‌రుగుతోందో 2.0 సినిమాలో శంక‌ర్ చూపిస్తున్నారు. అది కూడా ఒక కాకి మ‌నిషి (క్రోమ్యాన్) ని సృష్టించి స‌మ‌స్త జీవ‌కోటి, ప్రాణికోటి త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకుని అసాధార‌ణ‌ భ‌యాన‌క పోరాటాన్నే సృష్టించాడు మేధావి అయిన శంక‌ర్. ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ఈ సినిమాతో. ఈ సినిమా చూశాక సెల్ ఫోన్ వాడ‌డం మ‌నిషి మానేస్తాడా.. లేదా? అన్న‌ది అటుంచితే… ముందు ఓ ప్ర‌శ్న అయితే మాన‌వాళికి మెద‌డును తొలిచేయ‌క మాన‌దు.

అదంతా అటుంచితే సెల్ ఫోన్ బిజినెస్‌ని ప‌డ‌గొట్టేలా ఉన్న ఈ కాన్సెప్టుతో సినిమా తీయాల‌నుకున్న‌ది ఎవ‌రో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవ‌డం గ్యారెంటీ. అస‌లు ఈ సినిమా తీసిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ చేసే ప‌నేంటో తెలుసా? ఈ కంపెనీ ఓ మొబైల్ ఉత్స‌త్తుల కంపెనీ. లైకా మొబైల్స్ పేరుతో సెల్‌ఫోన్లు విచ్చ‌ల‌విడిగా అమ్మేస్తుంది. ఒక సెల్యులార్ కంపెనీ సెల్‌ఫోన్ మార్కెట్‌కే చిల్లు పెట్ట‌డం అంటే ఇదే. మొబైల్‌పై నెగెటివ్ థీమ్‌ని ఎంచుకుని సినిమా తీయాల‌నుకోవ‌డం అంటే ఇది నిజంగా దొంగ చేతికి తాళం చెవి ఇచ్చిన‌ట్టు. ఓవైపు సెల్యులార్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్(COAI ) 2.0 చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుకోవాల‌ని నానా యాగీ చేసింది. సెన్సార్ బోర్డ్‌కి మొర పెట్టుకుంది. అయినా అదెవ‌రూ ప‌ట్టించుకున్న‌దే లేదు. య‌థావిధిగా నేడు 2.0 రిలీజై థియేట‌ర్ల‌లో మోత మోగిస్తోంది. గుడ్ల‌ప్ప‌గించి చూడ‌డం త‌ప్ప COAI చేసేదేం లేద‌ని తేలిపోయింది. ఇక‌పోతే నేటి నుంచి 2.0 రికార్డుల మోత గురించిన ఆస‌క్తిక‌ర డిబేట్ మ‌రి కాసేప‌ట్లో మొద‌ల‌వుతుందేమో. ముందుగా ఈ సినిమా ఫ‌లితంపై క్రిటిక్స్ ఏం చెబుతారో వేచి చూడాల్సిందే.

User Comments