షాకింగ్.. క‌మ‌ల్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు..!

Last Updated on by

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో రిటైర్మెంట్ ల టైమ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ర‌జినీకాంత్ కూడా సినిమాలు చేయాలా వ‌ద్దా అనే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఓ వైపు రాజ‌కీయాల్లో ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఈ మ‌ధ్య అన్నీ ఫ్లాపులు వ‌స్తుండ‌టంతో కెరీర్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సినిమాలు చేయ‌నంటున్నాడు. ఈ కోవ‌లోకే క‌మ‌ల్ కూడా వ‌చ్చి చేరాడు. ఈయ‌న కూడా నాకు ఇక సినిమాలు చాలు అంటున్నాడు. కాక‌పోతే మ‌రో రెండేళ్లు.. రెండు సినిమాల త‌ర్వాత గుడ్ బై చెప్తానంటున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం ఈయ‌న శ‌భాష్ నాయుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొద‌లుపెట్టి చాలా కాల‌మైంది. ఇది ఆయ‌న సొంత సినిమా కాబ‌ట్టి స‌మ‌స్య లేదు. దాంతోపాటు విశ్వ‌రూపం 2 కూడా విడుద‌ల చేయ‌నున్నాడు క‌మ‌ల్. ఇక దాంతోపాటే భార‌తీయుడు 2 సినిమాకు క‌మిట‌య్యాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

శంక‌ర్ ఈ చిత్రాన్ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా తెర‌కెక్కించ‌బోతున్నాడు. 2.0 త‌ర్వాత భార‌తీయుడు 2 తెర‌కెక్క‌బోతుంది. శంక‌ర్ సినిమా అంటే క‌చ్చితంగా రెండేళ్లు ప‌డుతుంది కాబ‌ట్టే రెండేళ్ల త‌ర్వాత సినిమాల‌కు రిటైర్మెంట్ ఇస్తాన‌ని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న క‌మ‌ల్ సినిమాల నుంచి మెల్ల‌గా సైడ్ అయిపోవాల‌ని ఫిక్సైపోయాడు. ఈయ‌న కెరీర్ మొద‌లై 58 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో 1960లో బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు క‌మ‌ల్. 37 ఏళ్లుగా హీరోగా కొన‌సాగుతున్నాడు. ఈ మ‌ధ్య‌లో ప్ర‌పంచంలో ఏ న‌టుడికి సాధ్యం కాని రీతిలో ఎన్నో సినిమాల‌కు.. ఎన్నో సంస్థ‌ల నుంచి 182 అవార్డులు అందుకున్నాడు లోక‌నాయ‌కుడు. ఇక జాతీయ అవార్డులు, నంది అవార్డులు, రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డులకు కూడా కొద‌వే లేదు.

ఇన్నేళ్ల కెరీర్ పై మీరు సంతృప్తిగా ఉన్నారా.. లేదంటే ఇంకా ఎవ‌రైనా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయాల‌నుకున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తాను అన్నీ చూసాన‌ని చెప్పాడు క‌మ‌ల్. ఇక శ్యామ్ బెన‌గ‌ల్.. స‌త్య‌జిత్ రే లాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌లేద‌నే బాధ మాత్రం కాస్త ఉండేద‌ని.. ఐతే వాళ్లెప్పుడూ సినిమా ఆఫ‌ర్ చేయ‌లేద‌ని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ఇప్పుడు స‌త్య‌జిత్ రే గారు లేరు కూడా.. ఇలాంటి విష‌యాలు ఇప్పుడు మాట్లాడుకుని కూడా లాభం లేద‌న్నాడు క‌మ‌ల్ హాసన్. మొత్తానికి ఈ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఎందుకని సింపుల్ గా ఓ ప‌డ‌వ నుంచి తానే కాలు తీసేయ‌డానికి ఫిక్సైపోయాడు క‌మ‌ల్ హాస‌న్. మ‌రి.. సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లో ఏం మార్పు తీసుకొస్తాడో చూడాలి.

User Comments