షాక్.. చైతూకు అన్న‌య్య ఉన్నాడంట‌..!

Last Updated on by

అవునా.. అక్కినేని వారింట మ‌రో అబ్బాయి ఉన్నాడా..? అదేంటి.. నాగార్జున అన్న‌య్య వెంక‌ట్ కు కూడా కొడుకులు లేరుగా మ‌రి ఈ కొత్త అన్న ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు అనుకుంటున్నారా..? ఏమో.. అప్ప‌టి వ‌ర‌కు నాగార్జునకు కూడా తెలియ‌ని అన్న‌య్య‌ను ప‌ట్టుకొచ్చాడు నాగ‌చైత‌న్య‌. త‌న‌కు ఓ అన్న‌య్య ఉన్నాడ‌ని చెప్పి ఆఫీస‌ర్ ప్రీ రిలీజ్ లో షాకిచ్చాడు చైతూ. ఇంత‌కీ ఎవరా అన్న‌య్య అంటే ఇంకెవ‌రు నాగ్ అంటూ స‌మాధానమిచ్చాడు చైతూ. అది విన్న త‌ర్వాత అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు కానీ అందులో నిజం లేక‌పోలేదు.

అస‌లు నాగార్జున అంటే తెలియ‌ని వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లి చైతూను చూపించి ఇద్ద‌రూ ఏమ‌వుతారు అంటే క‌చ్చితంగా అన్నాద‌మ్ములు అనే చెబుతారు. ఇదే ఇప్పుడు చైతూ కూడా చెప్పాడు. పైగా నాగ్ ఫిజిక్ కూడా అలా ఉంది మ‌రి. అందుకే త‌న‌కు నాగ్ బ్ర‌ద‌ర్ లాంటి వాడంటూ స్వీట్ షాక్ ఇచ్చాడు చైతూ. జూన్ 1న ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది. వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ఇప్ప‌టి వ‌ర‌కు అంచ‌నాలైతే లేవు.. విడుద‌లైన త‌ర్వాత ఏదైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి..!

User Comments