కాలా క‌లెక్ష‌న్స్.. చూస్తే షాక్..!

Last Updated on by

ర‌జినీకాంత్ సినిమా విడుద‌లైందంటే బాక్సాఫీస్ కు పూన‌కాలు రావాలి. సినిమా ఎలా ఉంది అని అడ‌క్కుండానే రికార్డుల‌న్నీ వెతుక్కుంటూ మ‌రీ రావాలి. లింగా కానీ.. క‌బాలి కానీ.. చివ‌రికి యానిమేష‌న్ సినిమా కొచ్చాడ‌యాన్ కు కూడా క‌లెక్ష‌న్లు ఇలాగే వ‌చ్చాయి. వాటి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా కూడా తొలిరోజు మాత్రం బాక్సాఫీస్ ఊగిపోయింది. కానీ ఇప్పుడు కాలా మాత్రం చాలా విచిత్రంగా ర‌జినీకాంత్ కెరీర్ లోనే ఈ మ‌ధ్య కాలంలో చాలా త‌క్కువ వ‌సూళ్లు తీసుకొచ్చిన సినిమాగా చ‌రిత్రకెక్కింది. ఎందుకో తెలియ‌దు కానీ కాలాపై ముందు నుంచే చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత కూడా సినిమా యావ‌రేజ్ టాక్ రావ‌డంతో ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై ప‌డింది. దానికితోడు క‌ర్ణాట‌క‌లో కాలా విడుద‌ల కాక‌పోవ‌డం.. విదేశాల్లోనూ కొన్నిచోట్ల బ్యాన్ కావ‌డం.. ఇవ‌న్నీ కూడా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించాయి. దానికితోడు ఓవ‌ర్సీస్ లో కేవ‌లం 6 ల‌క్ష‌ల డాల‌ర్లు మాత్ర‌మే ప్రీమియ‌ర్స్ రూపంలో వ‌చ్చాయి.

ర‌జినీకాంత్ లాంటి సూప‌ర్ స్టార్ కు ఈ వ‌సూళ్లు అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చ‌ర్యంగానే ఉంది. ఎందుకంటే రెండేళ్ల కిందే క‌బాలి ఏకంగా 1.9 మిలియ‌న్ వ‌సూలు చేసింది ప్రీమియ‌ర్స్ తో. కానీ ఇప్పుడు అందులో మూడోవంతుతోనే కాలా స‌రిపెట్టుకున్నాడు. 2 వేల స్క్రీన్స్ లో విడుద‌లైన ఈ చిత్రం ఇండియాలో కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు తీసుకురాలేదు. క‌బాలి తెలుగు వ‌ర్ష‌న్ ఫ‌స్ట్ డే 9 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది.. కానీ ఇప్పుడు కాలా మాత్రం 5 కోట్ల‌కు అటూఇటూగా క‌లెక్ష‌న్లు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఇక త‌మిళ‌నాట కూడా కాలా కొత్త రికార్డులేవీ సృష్టించేలా క‌నిపించ‌ట్లేదు. అక్క‌డ కూడా ఈ చిత్రానికి ఎందుకో కానీ త‌క్కువ వ‌సూళ్లే వ‌స్తున్నాయి. మొత్తానికి కాలా తో మ‌రోసారి ర‌జినీ ఫ్యాన్స్ కు రంజిత్ షాక్ ఇచ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. దాంతో పాటే బాక్సాఫీస్ కు కూడా..!

User Comments