జూ.కాలేజ్‌లో జూ.చైతూ

Last Updated on by

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `శైల‌జారెడ్డి అల్లుడు` ఈనెల 31న రిలీజ‌వుతోంది. అటుపై `స‌వ్య‌సాచి` రిలీజ్ తేదీపై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోందిట‌. వాస్త‌వానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతోంది. ఇప్ప‌టికే సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. సెప్టెంబ‌ర్ 15 నాటికి నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసి, దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 7న సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. దీపావ‌ళి సెల‌వుల్ని క్యాష్ చేసుకోవ‌డ‌మే ధ్యేయంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో క‌థానాయ‌కుడి బాల్యానికి చెందిన ఎపిసోడ్స్‌ ఎపిసోడ్స్ ఎంతో ఇంపార్టెంట్. వీటిని ఉప్ప‌ల్ లిటిల్ ఫ్ల‌వ‌ర్ జూనియ‌ర్ కాలేజ్‌లో తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. త‌దుప‌రి విదేశాల్లో ఓ పాట‌ను తెర‌కెక్కించ‌నున్నారు. చైత‌న్య స‌ర‌స‌న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టించింది. మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. మైత్రి మూవీస్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

User Comments