ప్రభాస్ సాహో పై స్పందించిన శ్రద్దా కపూర్

బాహుబలి తరువాత మన సూపర్ హీరో ప్రభాస్ సాహో అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆది నుంచి వార్తల్లో ఉంటుంది. సినిమా అనుకోగానే వెంటనే టీజర్ రిలీజ్ చేశారు.  టీజర్ అదిరిపోవడంతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.  హాలీవుడ్ తరహాలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, మొన్నటివరకు ఒకవైపు షూటింగ్ జరుగుతున్నా.. హీరోయిన్ ఎవరు అన్నది బయటకు తెలియలేదు.  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో అనేకమందిని పరిశీలించారు.
మొదట అనుష్కనే అనుకున్నా.. ఎక్కువ సార్లు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. కొత్తవాళ్లను చూద్దామని అనుకున్నారు.  అయితే, అనేకమంది పేర్లను పరిశీలించిన యూనిట్ చివరకు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ను ఎంపిక చేసింది. సాహో లో చేసేందుకు శ్రద్దా కపూర్ కు అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారనే టాక్ కూడా వచ్చేసింది. ఇంతవరకు బాగానే ఉంది గాని.. సాహో టీమ్ అఫీషియల్ గా శ్రద్దా గురించి ప్రకటించినా, బాలీవుడ్ బ్యూటీ నుంచి దీనిపై ఎటువంటి స్పందనా లేదనే వాదనే వినిపించింది. అందుకేనేమో తాజాగా శ్రద్ధా కపూర్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రభాస్ సాహో సినిమాపై స్పందించింది. ప్రధానంగా సాహో లో ప్రభాస్ కు జోడీగా నటింస్తుండటం ఆనందంగా ఉందని, సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పి ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ వెల్కమ్ టు టాలీవుడ్ అంటూ శ్రద్దా కపూర్ ను ట్వీట్స్ తో ముంచెత్తుతున్నారు.