ఒంట‌రి షికార్లు.. అసలేమైంది?

ఏజ్ 36 దాటుతున్నా ఇప్ప‌టికీ అంతే బిగి స‌డ‌ల‌ని య‌వ్వ‌నంతో వేడెక్కిస్తోంది శ్రీయ‌. 2001లో ఇష్టం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మ‌డు రెండు ద‌శాబ్ధాల కెరీర్ కి చేరువ‌వుతోంది. అడ‌పాద‌డ‌పా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో ఉనికిని చాటుకుంటూనే ఉంది. నేడు రిలీజైన `ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు` చిత్రంలో అతిధి పాత్ర‌లో త‌ళుక్కుమంది. త‌దుప‌రి వెంకీ – నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న `వెంకీ మామ‌` చిత్రంలో శ్రీయ నాయిక‌గా న‌టిస్తోంది.
ప్ర‌స్తుతం ఈ భామ ఈజిప్ట్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్‌లో షికార్లు చేస్తోంది. అక్క‌డ న‌డిసంద్రంలో బోట్ షికార్ చేస్తూ వేడెక్కించే ఫోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీ‌య తో పాటు భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్ క‌నిపించ‌డం లేదు. పెళ్ల‌యిన త‌ర్వాత ఈ భామ ఆండ్రూతో క‌లిసి షికార్లు చేస్తోంది. కానీ ఈసారి ఒంట‌రిగానే క‌నిపిస్తోంది శ్రీయ‌. త‌న‌తో పాటే ఆండ్రూ ఉన్నాడా లేడా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు. శ్రీ‌య వైట్ అండ్ వైట్ లింగ‌రీ డ్రెస్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్.