వయసు పిలుస్తోంది.. మరి ఏం చేస్తావ్

Last Updated on by

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్ల‌వుతుంది.. వ‌య‌సు కూడా 35 దాటేసింది. అయినా ఇప్ప‌టికీ పెళ్లి గురించి ఊసే ఎత్త‌లేదు శ్రీ‌య స‌ర‌న్. తెలుగులో ఇష్టంగా అడుగుపెట్టి సంతోషంగా కెరీర్ ను మలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో.. అంద‌రు హీరోల‌తో న‌టించింది. తెలుగుతో పాటే త‌మిళ‌, హిందీ ఇండ‌స్ట్రీల్లోనూ సినిమాలు చేసింది శ్రీ‌య‌. ఇప్ప‌టికీ వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈమె న‌టించిన గాయ‌త్రి కూడా ఫిబ్ర‌వ‌రి 9న విడుదల కానుంది. సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య మంచి ఛాయిస్ గా మారిపోయిందిప్పుడు.

ఇండ‌స్ట్రీలో ఇంత బిజీగా ఉన్నప్పుడే పెళ్లికి సై అనేసింది ఈ భామ‌. త‌న బాయ్ ఫ్రెండ్ నే త్వరలో పెళ్లి చేసుకోబోతుంది శ్రీ‌య‌. రాజ‌స్థాన్ లో వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే శ్రీ‌య బాయ్ ఫ్రెండ్ కూడా ఇండియ‌న్ కాదు రష్యన్ కుర్రాడు. ఫారెన్ బాయ్ ఫ్రెండ్ కే ప‌డిపోయింది శ్రీ‌య స‌ర‌న్. బాయ్ ఫ్రెండ్ అమ్మ నాన్నలతో కూడా మాట్లాడిందట శ్రీయ. మొత్తానికి మిస్ గా ఇన్నాళ్లూ అన్ని ఇండ‌స్ట్రీల‌ను కుమ్మేసిన శ్రీ‌య‌… మిసెస్ గా మారిన త‌ర్వాత కూడా ఇండ‌స్ట్రీలోనే ఉంటుందో లేదో..?

User Comments