వయసు పిలుస్తోందని మేము చెప్పింది కరెక్టే

Last Updated on by

ఫిబ్రవరి 6 న శ్రీయ పెళ్లి చేసుకోబోతుంది అని బ్రేక్ చేసింది మై ఫస్ట్ షో, గాయత్రీ మూవీ ప్రమోషన్ లో కూడా శ్రీయ ని పెళ్లి గురించి అడిగితే అవి అన్నీ రూమర్స్ అని చెప్పి తప్పించుకొంది. కానీ మేము చెప్పించే కరెక్ట్ అయింది. శ్రీయ పెళ్లి రష్యన్ కుర్రాడు ఆండ్ర్యూ తో వివాహం జరిగింది.

హీరోయిన్స్ పెళ్లి అంటే ఉండే ర‌చ్చే వేరు. వాళ్లు చేసే ర‌చ్చతో ఇండ‌స్ట్రీ అంతా ఊగిపోతుంటుంది. కొంద‌రు ఎలాంటి సంద‌డి లేకుండా పెళ్లి చేసేసుకుంటారు కానీ కొంద‌రు మాత్రం మామూలు ర‌చ్చ చేయ‌రు. ఇప్పుడు శ్రీ‌య మొద‌టి లెక్క‌లోకి వ‌చ్చింది. ఈమె త‌న పెళ్లిని సీక్రేట్ గా చేసుకుంది. పెద్ద‌గా హ‌డావిడి లేకుండానే పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌న ర‌ష్య‌న్ బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూతోనే మూడు ముళ్లు వేయించుకుంది శ్రీ‌య. వీళ్ల పెళ్లి ఉద‌య్ పూర్ లో జ‌రిగింది. అక్క‌డే మార్చ్ 17, 18 తేదీల్లో ధూమ్ ధామ్ గా జ‌రిగింది. కాక‌పోతే ఆ ధూమ్ ధామ్ ను బ‌య‌టికి రానివ్వ‌లేదు అంతే. ఈ భామ పెళ్లితో ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోయిన్లు దాదాపు అంతా ఓ ఇంటివాళ్లైపోయారు ఒక్క త్రిష త‌ప్ప‌.

శ్రీ‌య ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు పెళ్లిళ్లు అయిపోయాయి.. ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 17 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 35 ఏళ్ల బ్యూటీ. తెలుగు ఇండ‌స్ట్రీకి 2001లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీ‌య‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీ‌య. మొత్తానికి ఇప్పుడు పెళ్లైన త‌ర్వాత కూడా శ్రీ‌య సినిమాలు ఆపేలా క‌నిపించ‌ట్లేదు. త‌న దారి త‌న‌దే అన్న‌ట్లుగా దూసుకెళ్లిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. అదీ లెక్క‌..!

వయసు పిలుస్తోంది.. మరి ఏం చేస్తావ్

User Comments