శ్రీ‌య‌.. మాటలు అస్సలు నమ్మకూడదు

Last Updated on by

ఇప్పుడు శ్రీ‌య మ‌రోసారి ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అని నిరూపించింది. ఈ భామ‌కు పెళ్లి అని నెల కింద ఓ వార్త వ‌స్తే కాదు.. అది త‌ప్పు.. త‌న‌కు ఇప్ప‌ట్లో పెళ్ళి గిళ్లి చేసుకునే ఉద్దేశ్య‌మే లేద‌ని చెప్పింది శ్రీ‌య‌. కానీ ఇప్పుడు ఈమె పెళ్లికూతురు కాబోతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్ల‌వుతుంది.. వ‌య‌సు కూడా 35 దాటేసింది.Shriya Saran Wedding With Russian Business Manతెలుగులో ఇష్టంగా అడుగుపెట్టి సంతోషంగా కెరీర్ ను మలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో.. అంద‌రు హీరోల‌తో న‌టించింది. తెలుగుతో పాటే త‌మిళ‌, హిందీ ఇండ‌స్ట్రీల్లోనూ న‌టించింది శ్రీ‌య‌. ఇప్ప‌టికీ వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూనే ఉంది. సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య మంచి ఛాయిస్ గా మారిపోయిందిప్పుడు.Shriya Saran Wedding With Russian Business Manఇండ‌స్ట్రీలో ఇంత బిజీగా ఉన్న‌పుడే పెళ్లికి సై అనేసింది ఈ భామ‌. త‌న బాయ్ ఫ్రెండ్ నే మార్చ్ లో పెళ్లి చేసుకోబోతుంది శ్రీ‌య‌. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో మార్చ్ 17.. 18.. 19 పెళ్లి వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌బోతున్నాయి. అంతేకాదు.. మార్చ్ 1న హోలీ సెలెబ్రేష‌న్స్ కూడా కాబోయే వాడితోనే చేసుకుంటుంది శ్రీ‌య‌.Shriya Saran Wedding With Russian Business Manఇక్క‌డ విచిత్రం ఏంటంటే శ్రీ‌య బాయ్ ఫ్రెండ్ కూడా ఇండియ‌న్ కాదు.. ర‌ష్య‌న్. ఆండ్రీ కొస్ చీవ్ అనే స్పోర్ట్స్ మ్యాన్ క‌మ్ బిజినెస్ మ్యాన్ తో ప్రేమ‌లో ప‌డింది శ్రీ‌య. త‌న లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ తోనే ఇప్పుడు ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతుంది శ్రీ‌య స‌ర‌న్. మొత్తానికి మిస్ గా ఇన్నాళ్లూ అన్ని ఇండ‌స్ట్రీల‌ను కుమ్మేసిన శ్రీ‌య‌… మిసెస్ గా మారిన త‌ర్వాత కూడా ఇండ‌స్ట్రీలోనే ఉంటుందో లేదో..?Shriya Saran Wedding With Russian Business Man

Shriya Saran Wedding With Russian Business Man

User Comments