అయోమయంలో శృతి కెరీర్

శ్రుతిహాసన్ కెరీర్ ఇప్పుడు పడిపోయింది.  కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఐరెన్ లెగ్ అని సంభోదించిన వ్యక్తులు తరువాత శృతి హాసన్ ను గోల్డెన్ లెగ్ అంటూ వెనకేసుకు వచ్చారు.  సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయి.  అయితే, అవకాశాలు ఎలా వస్తున్నాయో.. అదే విధంగా ఆమెపై రూమర్లు కూడా వస్తున్నాయి.  శృతి హాసన్ కు, తండ్రి కమల్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ప్రేమ వ్యవహారాన్ని కమల్ అంగీకరించడంలేదని.. అందుకే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పుకార్లు వస్తున్నాయి.  అయితే, ఈ పుకార్లను శృతి హాసన్ కొట్టిపడేస్తోంది.  ఇక కమల్ హాసన్ కూడా ఈ విషయం గురించి అడిగితే.. శృతి విషయంలో స్పందించడానికి ఏమిలేదు అని అంటూ పక్కన పెడుతున్నాడు.
కెరీర్ మంచి పొజీషన్లలో ఉండగా ఎందుకు శృతి తప్పులు చేస్తున్నదో అర్ధం కావడంలేదు.  శృతి చేస్తున్న పనుల వలన ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియదుగాని, నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కెరీర్ ఏమౌతుందో అని భయపడుతున్నారు. బాహుబలి ఇచ్చిన ఊపుతో తమిళంలో సంఘమిత్ర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో  తీస్తున్నారు.  ఇందులో శృతి నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి.  ఆమెకు భారీ ఆఫర్ ను కూడా ప్రకటించారు.  అంతేకాదు.. శృతి ఇందుకోసం కత్తియుద్ధంలో ట్రైనింగ్ కూడా తీసుకుంది.  ఏమైందో ఏమో తెలియదుగాని, ఈ సినిమా నుంచి శ్రుతి హాసన్ పక్కకు తప్పుకుంది.  బయటకు వచ్చినా.. సంఘమిత్ర వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇన్ని సమస్యల నడుమ శృతి హాసన్ కెరీర్ కొనసాగుతుందా.. లేక ఫుల్స్టాప్ పడిపోతుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది.