టాప్ హీరోయిన్ మ‌ళ్లీ షురూ చేసింది..!

శృతిహాస‌న్ ను ప్రేక్ష‌కులు దాదాపు మ‌రిచిపోయారు. హీరోలు ఎన్నేళ్లు క‌నిపించ‌క‌పోయినా పెద్ద‌గా స‌మ‌స్య లేదు కానీ హీరోయిన్ల‌కు మాత్రం భారీ గ్యాప్ వ‌స్తే మ‌రిచిపోవ‌డ‌మే. శృతి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈమెను దాదాపు అంతా మ‌రిచిపోయారు ఇప్పుడు. పైగా ఈ భామ కూడా ఇప్పుడు సినిమాలు మానేసి హాయిగా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బ‌మ్స్ చేస్తుంది. వాటిపైనే త‌న దృష్టి పెట్టింది శృతిహాస‌న్.
Shruti Haasan Hello Magazine Cover Page Hottest Photoshoot
ఇప్పుడు ఈ భామ తీరు చూస్తుంటే ఇక సినిమాలే చేయ‌దేమో అనుకున్నారంతా. కానీ ఇలాంటి టైమ్ లో స‌డ‌న్ గా ఏమైందో ఏమో తెలియ‌దు కానీ ఓ ఫోటోషూట్ తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది శృతిహాస‌న్. ఈ మ‌ధ్య కాస్త ఒళ్లు చేసిన శృతి.. ఇప్పుడు మ‌ళ్లీ అందాల‌ను శృతి చేస్తుంది. కాస్త బ‌రువు త‌గ్గి మున‌ప‌టి షేప్ లోకి వ‌చ్చేస్తుంది ఈ భామ‌.
Shruti Haasan Hello Magazine Cover Page Hottest Photoshoot
శృతి మ‌న‌సు మార్చుకుని మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చినా వ‌స్తుందేమో మ‌రి. ఇప్ప‌టికైతే ఏ సినిమాను కూడా సైన్ చేయ‌లేదు శృతిహాస‌న్. సాహో లాంటి పెద్ద సినిమాల‌ను కూడా వ‌దిలేసింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఇప్పుడు ఈ ఫోటోషూట్ చూసిన త‌ర్వాత మ‌ళ్లీ శృతివైపు ద‌ర్శ‌క నిర్మాత‌ల చూపులు పడ‌తాయేమో..!
Shruti Haasan Hello Magazine Cover Page Hottest Photoshoot