శృతిహాసన్ షాక్.. సినిమాల‌కు బైబై..

అదేంటి.. ఇంకా పెళ్లి కూడా కాలేదు.. పైగా బోలెడంత క్రేజ్ ఉంది.. ఇలాంటి టైమ్ లో శృతిహాస‌న్ సినిమాల‌కు దూరం కావ‌డం ఏంటి.. అస‌లు ఏం చేస్తుంది ఈ భామ అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ భామ‌కు సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోయిన‌ట్లు క్లియ‌ర్ గా తెలుస్తోంది. అందుకే ఏ భాష‌లోనూ సినిమాలేవీ ఒప్పుకోవ‌ట్లేదు శృతిహాస‌న్. ఏడాది కింది వ‌ర‌కు శృతిహాస‌న్ కు తెలుగుతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల్లో కూడా చాలా క్రేజ్ ఉండేది. ఈమె కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూసారు. కానీ ప్ర‌స్తుతం ఈ భామ‌కు అవ‌కాశాల్లేవు. అడిగితే న‌చ్చిన పాత్ర‌లు రావ‌ట్లేదు.. అందుకే వ‌ద్ద‌నుకుంటున్నానంటూ క‌థ‌లు చెబుతుంది. శృతి ఖాళీగా ఉండ‌టం వెన‌క మ‌రో క‌థ కూడా వినిపిస్తుంది.

ఈ భామ ఇప్పుడు బాగా లావైపోయింది. ఇదివ‌ర‌కు మ‌నం చూసిన శృతికి.. ఇప్పుడు మ‌నం చూస్తోన్న‌ శృతికి చాలా తేడాలు క‌నిపిస్తున్నాయి. ఈమెలో మున‌ప‌టి గ్లామ‌ర్ క‌నిపించ‌ట్లేదు. శృతిహాస‌న్ కు పెళ్లి అయి పోయిందా అనే అనుమానం ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌కు కూడా క‌లుగుతుంది. ఒక‌ప్పుడు స‌న్న‌గా మెర‌పుతీగ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయింది. ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌డ‌మే మానేసింది. కాట‌మ‌రాయుడులో శృతి అప్పియ‌రెన్స్ పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌పై మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే శృతిహాసన్ పెళ్లి. అవును.. ఈ భామ‌కు పెళ్లైంద‌నే వార్త‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. లండ‌న్ లో ఈమెకు ఓ ప్రియుడు ఉన్నాడు. అత‌డితోనే డేటింగ్ చేస్తుంది శృతి. పైగా ఈ మ‌ధ్య లండ‌న్ భాగా వెళ్తోంది శృతిహాస‌న్.

ఇదొక్క‌టే కాదు.. శృతిహాస‌న్ కు ముందు నుంచి సినిమాల‌తో పాటు మ్యూజిక్ పై కూడా ఆస‌క్తి ఉంది. అందుకే సినిమాలు మానేసి.. మ్యూజిక్ పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి రాక‌ముందే ఈమెకు సంగీతంపై ప‌ట్టుంది. ఈనాడు లాంటి సినిమాల‌కు మ్యూజిక్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రైవేట్ ఆల్బ‌మ్స్ చేయాల‌ని చూస్తుంది శృతి. దానికోస‌మే కాన్సెప్ట్ సిద్ధం చేసుకుంటుంది. ఇవి స‌క్సెస్ అయితే సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి రాక్ స్టార్ గా సెటిలైపోవాల‌ని చూస్తుంది. అందుకే కొత్త వాటికి ఓకే చెప్ప‌డం లేదు. మొత్తానికి ప‌ర్స‌న‌ల్ ప్ల‌స్ ప్రొఫెష‌న‌ల్ క‌లిపి శృతిహాస‌న్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డానికి రెడీ అవుతుంద‌న్న‌మాట‌.