వ్వాట్‌! శ్రుతిహాస‌న్ బ్రేక‌ప్!!

Last Updated on by

వ్వాట్! శ్రుతిహాస‌న్‌కు బ్రేక‌ప్ అయ్యిందా? బోయ్‌ఫ్రెండ్ టాటా.. బాయ్ బాయ్ చెప్పేశాడా? ప్చ్‌.. ఇంత‌లోనే ఏమైంది? మొన్న‌నే క‌దా.. బోయ్‌ఫ్రెండ్‌ని మమ్మీడాడీల‌కు ప‌రిచ‌యం చేసింది. ఇంత‌లోనే ఎంత సిత్రం అంటారా? అయితే అస‌లేం జ‌రిగిందో తెలియాలంటే డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ మాయ‌మైంది. అస‌లేమైందో ఏంటో అనుకుంటుండ‌గానే స‌డెన్ ట్విస్టిస్తూ విదేశీ బోయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌లేతో చెన్న‌య్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా డాడ్ క‌మ‌ల్‌హాస‌న్‌, మామ్, సారిక‌ల‌కు బోయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ని ప‌రిచ‌యం చేసి, ప‌లు ఈవెంట్ల‌లో సంద‌డి చేసి నానా రాద్ధాంతం చేసింది. అటుపై సినిమాల‌కు కొంత‌కాలం బ్రేక‌ప్ చెప్పేసి, అత‌డితో ముంబైలోని ఓ ఖ‌రీదైన అపార్ట్‌మెంట్‌లో స‌హ‌జీవ‌నం ప్రారంభించింది. ఆ ఇరువురి మ‌ధ్య ప్ర‌ణ‌యంతో ముంబై అపార్ట్‌మెంట్ పొగ‌లు క‌క్కుతోంద‌న్న ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో సాగింది. అదంతా అటుంచితే, గ‌త కొంత‌కాలంగా మైఖేల్ కోర్స‌లే ముంబై ప‌రిస‌రాల్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో శ్రుతి ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందంటూ ఒక‌టే ప్ర‌చారం సాగింది. ఇలాంటి విష‌యంలో ముంబై మీడియా ఎంతో ముందుంటుంద‌న్న సంగ‌తి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. మేఖేల్ కోర్స‌లేతో ముంబైలో స‌హ‌జీవ‌నం వేళ గొడ‌వ‌లై ఇద్ద‌రికీ బ్రేక‌ప్ అయ్యింద‌న్న స్పెక్యులేష‌న్స్ సాగాయి. అయితే ఈలోగానే ఊహించ‌ని ట్విస్ట్‌. ఈ జంట నిన్న‌మొన్న‌నే ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేసి తిరిగి వెళుతుండ‌గా కెమెరా కంటికి చిక్కింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వెబ్‌లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారులే అని అంతా క‌న్ఫ‌ర్మేష‌న్‌కి వ‌చ్చారు. అదీ అస‌లు సంగ‌తి. ఇప్ప‌టికైతే నో బ్రేక‌ప్ సుమీ!

User Comments