ప‌ర్ ఫెక్ట్ హార్ర‌ర్ ఇప్పుడు ఎక్కుతుందా..?

హార్ర‌ర్ సినిమాలంటే ఇప్పుడు కామెడీ అయిపోయింది. అందుకే కామెడీ క‌లిపి హార్ర‌ర్ సినిమాల‌ను హార్ర‌ర్ కామెడీ అనే కొత్త జోన‌ర్ క‌నిపెట్టారు. కొన్నేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న సినిమాల‌న్నీ ఇలాంటి జోన‌ర్ లో వ‌స్తున్న‌వే. ప‌ర్ ఫెక్ట్ హార్ర‌ర్ సినిమా చూసి ప్రేక్ష‌కులు చాలా ఏళ్ళే అవుతుంది. ఇలాంటి టైమ్ లో సిద్ధార్థ్ ఆ ప్ర‌య‌త్నం చేశాడు. అదే గృహం సినిమా. ఇప్ప‌టికే త‌మిళ‌నాట ఆవ‌ల్ గా వ‌చ్చి పర్లేద‌నిపించింది ఈ చిత్రం. ఓ ఇంట్లో ఉండే దెయ్యాలు ఆడుకునే ఆటే ఈ చిత్రం. ఆట అంటే కామెడీగా కాదు.. ప‌క్కా హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ అన్న‌మాట‌. ఎక్క‌డా సీరియ‌స్ నెస్ త‌ప్ప కామెడీ ఉండ‌దు. ఒక‌ప్పుడు వ‌ర్మ చేసిన రాత్రి, దెయ్యం త‌ర‌హాలో అన్న‌మాట‌. ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావ‌డం అరుదుగా మారింది. ఇలాంటి టైమ్ లో ఈ ప్ర‌య‌త్నం చేసాడు సిద్ధార్థ్. ఈ ప్ర‌య‌త్నానికి తెలుగులో మంచి మార్కులు ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాడు ఈ హీరో. మ‌రి ఈ హీరో ఆశ‌ల్ని గృహం ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో.. ఇప్పుడున్న టైమ్ లో హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ఎలా ఆదరిస్తారో చూడాలి..!