ఈసారి క‌నిపిస్తే చెంప ప‌గ‌ల‌గొడ‌తా!

ఆ మ‌ధ్య మీటూ ఉద్య‌మంలో భాగంగా గాయ‌ని చిన్మ‌యి ర‌చ‌యిత వైరముత్తుపై లైంగిక ఆరోప‌ణ‌లు ఎంత‌టి సంచ‌ల‌న‌మ య్యాయో తెలిసిందే. ఫ‌లితంగా చిన్మ‌యి కోలీవుడ్ లో టార్గెట్ అయింది. అయినా బెద‌ర‌కుండా వైరముత్తుపై ఆరోప‌ణ‌లు నేటికి చేస్తూనే ఉంది. తాజాగా న‌టి ఖుష్బు కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎదురైన చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకుని మ‌రోసారి వైరా ముత్తుపై, చిన్మ‌యి నిప్పులు చెరిగింది. కుష్బును ఓ వ్య‌క్తి తాక‌రాని చోట తాక‌డంతో వెంట‌నే ఆమె ఆ వ్య‌క్తి చెంప చెళ్లు మ‌నిపించింది. దీన్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ చిన్మయికి ట్వీట్‌ చేశారు.

‘ఈ మాటలు కేవలం చిన్మయి కోసం మాత్రమే.. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన చిన్మ‌యి ఏమందంటే? ఈసారి వైర‌ముత్తు క‌నిపిస్తే నేను చెంప ప‌గ‌ల‌గొట్టాల‌న్న విష‌యం గుర్తు పెట్టుకుంటా. ఈ విధంగా చేస్తేనే నాకు న్యాయం జ‌రుగుతుంద‌ని..అప్ప‌టికైనా న‌మ్మాల్సిన వాళ్లు న‌మ్ముతారామేన‌ని తెలిపింది. అయితే ష‌రా మూములుగా వైర‌ముత్తు అభిమానులు మ‌రోసారి చిన్మ‌యి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప‌బ్లిసిటీ కోస‌మే వైర‌ముత్తును టార్గుట్ చేసింద‌ని కామెంట్లు పెడుతున్నారు.