సింగ‌ర్ సునీత పెళ్లి గోల‌

Last Updated on by

టాలీవుడ్‌లో ఉన్న మేటి ప్ర‌తిభావ‌ని సీనియ‌ర్‌ గాయ‌ని సునీత‌. కోటానుకోట్ల హృద‌యాల్ని గెలిచిన గొప్ప నేప‌థ్య గాయ‌ని. అయితే సునీత వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవ‌డం, అటుపై మీడియా ప్ర‌చారం గురించి తెలిసిందే. అదంతా అటుంచితే సునీత 19 వ‌య‌సులో కిర‌ణ్ అనే వ్య‌క్తిని పెళ్లాడారు. ఆ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే కాల‌క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి సునీత విడిగా ఉంటున్నారు. ఇప్పుడు సునీత వ‌య‌సు 40. ఈ ఏజ్‌లో తాను పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

సోష‌ల్ మీడియాలో సునీత పెళ్లి గోల ఓ డిబేట్‌లా న‌డుస్తోంది. ఇదే ప్ర‌శ్న సునీత‌ను ఎవ‌రో ఫేస్‌బుక్ ద్వారా అడిగితే, ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితాల‌పై ఎందుకింత అత్యుత్సాహం? అని ఎదురు ప్ర‌శ్నించారు సునీత‌. అయితే తాను పెళ్లాడుతున్నారా? లేదా? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌నేలేదు. ఈ విష‌యాన్ని ఖండించ‌నూ లేదు. ఔన‌ని చెప్ప‌నూ లేదు. దీంతో అభిమానుల్లో ఒక‌టే డైలెమా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. అలాంటిది సునీత చేసుకుంటే త‌ప్పేంటి? అంటూ ఓ సెక్ష‌న్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

User Comments