ఏ్రప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న‌ బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, తేజ కాంబినేష‌న్ చిత్రం `సీత

Last Updated on by

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న చిత్రం `సీత‌`. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ మ‌హిళల దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు.

శ్రీనివాస్, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న రెండో చిత్ర‌మిది. తేజ ఈ సినిమాను అన్నీ అంశాల క‌ల‌యిక‌తో పెర్ఫామెన్స్ ప్ర‌ధానంగా రూపొందిస్తున్నారు.

ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌, మ‌న్నారా చోప్రా కీల‌క పాత్ర ధారులు. ప్ర‌స్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా, శిర్షా రే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అనీల్ సుంక‌ర సార‌థ్యంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సినిమా రూపొందుతుంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, సోనూ సూద్‌, మ‌న్నారా చోప్రా త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం: తేజ‌, నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, బ్యాన‌ర్ :ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గిరిక‌పాటి, కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, స‌మ‌ర్ప‌ణ‌: ఏ టీవీ, సంగీతం: అనూప్ రూబెన్స్‌, సినిమాటోగ్ర‌ఫీ: శిర్షా రే, ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, ప‌బ్లిసిటీ ఇన్‌చార్జ్‌: విశ్వ సి.ఎం.

User Comments