మ్యావ్ మ్యావ్ పిల్లీ అంటేనే ఇష్ట‌మ‌ట‌

మహేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు కోసం పెద్ద‌యెత్తున ప్ర‌మోష‌న్స్ చేశాడు. టీవీలు, పేప‌ర్లు, వెబ్‌సైట్లు, ఎఫ్.ఎమ్‌లు… ఇలా ప్ర‌చారానికి కాదేదీ అన‌ర్హం అన్న‌ట్టుగా అన్ని మాధ్య‌మాల్ని వినియోగించుకున్నారు. కానీ ఈ ప్ర‌యాణంలో బెస్ట్ పార్ట్ మాత్రం ఆయ‌న్ని ఇద్ద‌రు చిన్నారులు ఇంట‌ర్వ్యూలు చేయ‌డ‌మేన‌ట‌. ఆ చిన్నారులు ఎవ‌రో కాదు.. ఒక‌రు మ‌హేష్ కూతురు సితార‌, మ‌రొక‌రు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌. ఈ ఇద్ద‌రికీ ఎ అండ్ ఎస్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ ఉంది. ఆ ఛాన‌ల్ కోసం ఆద్య‌, సితార క‌లిసి మ‌హేష్‌ని ఇంట‌ర్వ్యూ చేశారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడిగారు.

ఇందులో భాగంగా మీకిష్ట‌మైన పంచ్ ఏంట‌ని వాళ్లు మ‌హేష్‌ని అడ‌గ్గా… మీరంద‌రూ నేను కాపాడుకునే ప్రాణాలు అనే డైలాగ్‌ని చెప్పారు. ఆ త‌ర్వాత మీకిష్ట‌మైంది ఏంట‌ని మ‌హేష్ ఆ ఇద్ద‌రినీ అడ‌గ్గా…. మ్యావ్ మ్యావ్ పిల్లీ మిల్క్ బాయ్‌కి పెళ్లి అంటూ న‌వ్వేశారు. వీళ్ల‌తో స‌ర‌దాగా క‌లిసిపోయి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మ‌హేష్‌. పిల్ల‌లంటే మ‌హేష్‌కి చాలా ఇష్టం. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కి అదే రీతిలో స్పందిస్తూ వాళ్ల‌పై అప్పుప్ప‌డు స‌ర‌దా జోక్‌లు పేలుస్తూ ఇంట‌ర్వ్యూని పూర్తి చేశారు