డాడ్‌తో సితార‌ క‌బుర్లేంటో?

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ 25వ సినిమా మ‌హ‌ర్షిలో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు- అశ్వ‌నిదత్- పీవీపీ బృందం నిర్మిస్తున్నారు. మే 9న సినిమాని రిలీజ్ చేయనున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో కాస్తంత ఊర‌ట అవ‌స‌రం అని భావించారో ఏమో.. ఇదిగో ఇలా క్యూట్ సితార‌ ఆన్ సెట్స్ కి వ‌చ్చి చెబుతున్న క‌బుర్లు వింటున్నారు. త‌న లైఫ్ లో ఒత్తిడిని అధిగ‌మించే ఏకైక మార్గం క్యూటీతో మాట్లాడ‌డ‌మేన‌ని అన్నారు.

మొత్తానికి సితార బుజ్జి బుజ్జి మాట‌ల‌న్నీ మ‌హేష్ కి అల‌స‌ట నుంచి సాంత్వ‌న క‌లిగిస్తాయ‌న్న మాట‌. ఇప్ప‌టికే సితార‌కు స్ట్రెస్ బ‌స్ట‌ర్ అని బిరుదిచ్చేశాడు. ఇటీవ‌లే ఏఎంబీ సినిమాస్ లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని మ్యాడ‌మ్ టుస్సాడ్స్ వాళ్లు ఆవిష్క‌రించిన‌ప్పుడు సితార ఆ విగ్ర‌హాన్ని చూస్తూ అలానే ఉండిపోయింది. అక్క‌డ డాడ్ తో బోలెడ‌న్ని క‌బుర్లు చెప్పింది. మొత్తానికి సితార‌తో మ‌హేష్ కి బాగానే టైమ్ పాస్ అవుతోంది. అంత‌కుమించి అస‌లి సొల‌సినప్పుడు త‌న వ‌ల్ల ఒత్తిడి నుంచి రిలీఫ్ ద‌క్కుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా త‌ర్వాతా వ‌రుస‌గా షెడ్యూల్స్ బిజీనే. త‌దుప‌రి ఎఫ్ 2 డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడితో సినిమాకి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments