నాగ‌బాబుకి రిట‌ర్న్ గిప్ట్ ఇస్తా: శివాజీ రాజా

Last Updated on by

ఇటీవ‌ల జ‌రిగిన `మా` మూవీ ఆర్టిస్ట్ ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై న‌రేష్ గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మార్చి 31 వ‌ర‌కూ శివాజా రాజాకు అధ్యక్షుడిగా గ‌డువు ఉన్న నేప‌థ్యంలో అప్ప‌టివ‌ర‌కూ కుర్చి ఎక్క‌డానికి వీల్లేదంటూ వ్యాఖ్యానించార‌ని న‌రేష్ బ‌హిరంగం చేసాడు. తాజాగా దీనికి కౌంట‌ర్ గా శివాజీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి న‌రేష్ పై ఆరోప‌ణ‌లు చేసాడు. ఇత‌రుల‌ను బాధపెట్టే వ్యాఖ్య‌లు మానుకోవాలి. మా ప‌రువును రోడ్డుకు లాగొద్దు. ఈ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం నాకు ఇష్టం లేదు. కానీ కొంత మంది ఒత్తిడి తీసుకురావ‌డం వ‌ల్ల పెట్టాను. ఎన్నిక‌లు అయిపోయాయి కాబ‌ట్టి ఎవ‌రైనా హుందాగా ప్ర‌వ‌ర్తించాలి.

మా రూల్స్ ప్ర‌కారం మార్చి లో ఎన్నిక‌లు, ఏప్రిల్ లో ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గాలి. నా ప్ర‌మాణ స్వీకారం అలాగే జ‌రిగింది. మా నూత‌న కార్య‌వ‌ర్గానికి నేను అడ్డుప‌డ‌లేదు. ఓడిపోయిన తర్వాత నేను ఆఫీస్ కు వెల్లింది లేదు. అక్క‌డ నా బాధ్య‌త‌లు పూర్త‌య్యాయి. మ‌లేషియా వెళ్లిన‌ప్పుడు మేమంతా త‌క్కు ఖ‌రీదు గల రూమ్ లో ఉంటే న‌రేష్ మాత్రం ఖ‌రీదైన రూమ్ లో ఉన్నాడు. అప్పుడు `మా` డ‌బ్బులు అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు అవుతున్నాయ‌ని తెలియ‌దా? 2019 డైరీ విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. 14 ల‌క్ష‌లు వ‌స్తే 7లక్ష‌లే క‌నిపిస్తున్నాయి. బ్యాలెన్స్ ఎటెళ్లిన‌ట్లు? వీట‌న్నింటికి న‌రేష్ త‌ప్ప‌క స‌మాధానం చెప్పాలి. నేను అధ్య‌క్షుడిని అయిన‌ప్పుడు మా నిధి 2.90 కోట్లు ఉంది. దాన్ని త‌ర్వాత 5 కోట్లు చేసానన్నారు. అలాగే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకి రిట‌ర్న్ గిప్ట్ ఉంటుంది. ఆయ‌న్నేమి మ‌ర్చిపోలేదు. చిరంజీవి గారి స‌హాకారం మాత్రం మ‌రువ‌లేనిది అని అన్నారు.

Also Watch: Sivaji Raja Latest Press Meet Stills

User Comments