న‌రేష్ ఓ శాడిస్ట్..బ‌ర్త్ డే రోజున వెయిట్ చేయించాడు!

Last Updated on by

ఈసారి మా ఎన్నిక‌ల వాతావార‌ణం మామూలుగా లేదు. ల‌వ‌కుశ‌ల క‌లిసి ప‌నిచేసిన శివాజీరాజా, న‌రేష్ ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు పోటీకి సై అన్నారు. మార్చి 10న తేల్చుకుందాం! అంటూ స‌వాల్ విసురుకుని ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో శివాజీ రాజా వ‌ర్గం కామ్ గా ఉన్నా! న‌రేష్ అండ్ టీమ్ మాత్రం యాంటీ వ‌ర్గాన్ని వీక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందే మాన‌సికంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా టీవీ షో చ‌ర్చా వేదిక‌ల్లో పాల్గొన్ని ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని వాళ్ల మాట‌ల‌ను బట్టే తెలుస్తోంది. న‌రేష్ తో పాటు, జీవితారాశేఖ‌ర్ కూడా తోడ‌వ్వ‌డంతో అగ్నికి మ‌రింత జ్వాల తోడైన‌ట్లు అయింది.

ఇన్నాళ్లు `మా` గ‌డప‌ తొక్క‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు న‌రేష్ వెంటుండి చిరంజీవిని మ‌ళ్లీ బ్యాచ్ చేసే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని విమ‌ర్శ లొస్తున్నాయి. వాస్త‌వానికి శివాజీ రాజా పై న‌రేష్ ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు..దాని వెనుక ఏం జ‌రిగింద‌న్న అంశం జీవిత‌రాశేఖ‌ర్ ల‌కు తెలియ‌దు. వాళ్లిద్ద‌రూ క‌లిసి ప‌నిచేసిన రోజుల్లో జీవితా రాజ‌శేఖ‌ర్ ఎక్క‌డా క‌నిపించింది లేదు. మ‌రీ ఉన్న‌ట్లుండి భార్యాభ‌ర్త‌లిద్ద‌రు ఎందుకు ఊడిప‌డిన‌ట్లు? అంటే వాళ్లిద్ద‌రి ఎంట్రీ వెనుక పెద్ద ఎత్తుగ‌డే ఉంద‌ని వినిపిస్తోంది. మీడియా కెక్కి జీవితారాజ‌శేఖ‌ర్ నిజానిజాలు తెలియ‌కుండా చాలా విష‌యాలు మాట్లాడార‌ని మీడియా వార్గాల్లో సైతం చర్చ‌కొచ్చింది.

తాజాగా నిన్న‌టి రోజున ఆ మాట‌ల‌ను గుర్తుచేసుకుని శివాజీ రాజా క‌న్నిటి ప‌ర్యంతం చెందారు. నిజాలు తెలుసుకుని మాట్లాడినా…వాటిని నిరూపించినా ఒప్పుకుంటా! త‌ప్ప అబ‌ద్దాల‌ను నిజాల‌ను చేసే ప్ర‌య్న‌తం మానుకోవాల‌ని కోరారు. ఇక న‌రేష్ త‌న ప‌ట్ల వ్వ‌వ‌రించిన తీరును గుర్తు చేసుకుని వాపోయారు. శివాజీ రాజా పుట్టిన రోజు సంద‌ర్భంగా న‌రేష్ ఆయ‌న్ని నైట్ 11 గంట‌ల వ‌ర‌కూ ఫిలిం చాంబ‌ర్ ఆపీస్ లో వెయిట్ చేయించాడుట‌. మ‌రో ప‌క్క శివాజీ రాజా భార్య పిలిం నంగ‌ర్ టెంపుల్ లో వెయిట్ చేసారుట‌. ఛాంబ‌ర్ సందులోనే కారులో కూర్చోని విషెస్ చెప్ప‌డానికి అదిగో వ‌స్తాను…ఇదిగో వ‌స్తానని తాత్స‌నం చేసాడ‌ని శివాజీ రాజా వాపోయారు. శివాజా నాకోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో! చూసారా? అంటూ మ‌రుస‌టి రోజు త‌న స్నేహితుల‌కు చెప్పుకుని న‌రేష్ చంక‌లు గుద్దుకున్నాడ‌ని శివాజీ రాజా మీడియాకు వెల్ల‌డించారు. ఈ విధంగా న‌రేష్ త‌న‌ప‌ట్ల శాడిస్ట్ లా ప్ర‌వ‌ర్తించాడ‌ని శివాజా ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

User Comments