శివాజీ విడుదల.. కానీ విచారణ త‌ప్ప‌దు

టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అరెస్ట్ చేసి.. సైబరాబాద్ పీఎస్‌కు తరలించారు.అనంతరం సుమారు 3 గంటల పాటు అలంద మీడియా, టీవీ9 వాటాల కొనుగోలు తదితర అంశాలపై పోలీసులు శివాజీని విచారించారు. అనంతరం 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా చెప్పి ఇంటికి పంపించివేశారు.