ర‌జ‌నీపై దుష్ప్ర‌చారం?

Last Updated on by

త‌లైవా ర‌జ‌నీకాంత్ అనారోగ్య‌నికి గుర‌య్యారా? అంటే అవున‌నే సోష‌ల్ మీడియా హ‌డావుడి సాగుతోంది. మునుప‌టిలానే మ‌ళ్లీ అనారోగ్య‌నికి గుర‌య్యార‌ని, విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న కుటుంబ స‌భ్యులు ర‌జ‌నీని ఆసుప‌త్రిలో చేర్పించార‌ని తాజాగా వ‌దంతులు వేడెక్కిస్తున్నాయి.

ఈ వ‌దంతుల్ని ర‌జ‌నీ స‌న్నిహిత వ‌ర్గాలు తోసిపుచ్చాయి. ర‌జ‌నీ ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేద‌ని, ఆయన క్ష‌మంగా వున్నార‌ని తెలిపారు. ర‌జ‌నీపై వ‌చ్చే వ‌దంతుల్ని ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆరోగ్యం బాగానే వుంద‌ని, 2.0 ప్ర‌మోష‌న్‌లో ప్ర‌స్తుతం ఆయ‌న బిజీగా వున్నార‌ని స్ప‌ష్టం చేయ‌డంతో సూప‌ర్‌స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక‌పోతే ర‌జ‌నీ రాజ‌కీయారంగేట్రం వేళ త‌న‌పై ర‌క‌ర‌కాల దుష్ప్ర‌చారం సాగ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. 2.0 సెట్స్ కెళ్లే క్ర‌మంలోనూ ఈ త‌ర‌హా ప్ర‌చారం సాగింది. కొచ్చాడ‌యాన్ టైమ్‌లోనూ ఇదే స‌న్నివేశం. ఆయ‌న జ‌న‌ర‌ల్ చెక‌ప్‌కి వెళ్లినా నానా హ‌డావుడి చేసేస్తున్నారు. ఆరోగ్యం విష‌మం అంటూ చెడు ప్ర‌చారం చేయ‌డం దారుణం. ఇక‌ శంక‌ర్‌, ర‌జ‌నీల క‌ల‌యిక‌లో వ‌స్తున్న `2.0`పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దాదాపు 600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్ష‌క‌ల ముందుకు రాబోతోంది.

User Comments