ఫిబ్రవరి 16 న ‘సోడా గోలీసోడా’ విడుదల

Last Updated on by

ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పణలో మల్లూరి హరిబాబు దర్శకత్వంలో నిర్మాత భువనగిరి సత్య సింధూజ నిర్మించిన  చిత్రం ‘సోడా గోలీసోడా’. మానస్, నిత్య నరేష్, కారుణ్య హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 16 న విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా నిర్మాత భువనగిరి సత్య సింధూజ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని వర్గాలను ఆకర్షించే కంటెంట్ ఉంది. కమర్షియల్ విలువలతో.. ఎక్కడా వెనుకాడకుండా చిత్రాన్ని నిర్మించాము. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 16 న చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. ‘సోడా గోలీసోడా’ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము.. అని అన్నారు.

మానస్, నిత్య నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్, నిర్మాత: భువనగిరి సత్య సింధూజ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మల్లూరి హరిబాబు.

Follow US 

User Comments