బంగార్రాజు గెట్ రెడీ

Last Updated on by

అక్కినేని నాగార్జున హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `సోగ్గాడే చిన్నినాయనా` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నాగార్జున కెరీర్‌కి చ‌క్క‌ని విజ‌యాన్ని అందించింది. కింగ్‌కి ఓవ‌ర్సీస్‌లోనూ మార్కెట్ పెంచిన చిత్ర‌మిది. ఆ క్ర‌మంలోనే హిట్ అందుకున్న హుషారులో నాగార్జున సీక్వెల్ చేస్తాన‌ని, క‌ళ్యాణ్‌కి మ‌రో అవ‌కాశం ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆ త‌ర‌వాత ఇత‌ర‌త్రా ప్రాజెక్టుల‌తో నాగార్జున బిజీ అయిపోయారు. ఆ క్ర‌మంలో క‌ళ్యాణ్ కృష్ణ మాస్ రాజా ర‌వితేజ‌తో సినిమా చేశారు. ఇటీవ‌లే రిలీజైన ర‌వితేజ‌ `నేల టిక్కెట్‌` ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా క‌ళ్యాణ్ పైనా, అత‌డు తీర్చిదిద్దిన బంగార్రాజు స్క్రిప్టుపైనా పూర్తి న‌మ్మ‌కంతో నాగార్జున ఓకే చెప్పార‌ని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా స్క్రిప్టును ఫైన‌ల్ డ్రాఫ్ట్ నాగార్జున‌కు ఇంకా వినిపించాల్సి ఉందిట‌. క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి కింగ్‌కి వినిపించేందుకు ప్రిప‌రేష‌న్‌లో ఉన్నాడుట‌. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మూవీని ప్రారంభించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఆర్జీవీ తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ నాగార్జున‌కు తీవ్ర నిరాశ‌నే మిగిల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ జోల్ట్ నుంచి కోలుకునేందుకు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాల్సిన స‌న్నివేశం ఉందిప్పుడు. కాకినాడ‌ క‌ళ్యాణ్ తొంద‌ర్లోనే గుడ్ న్యూస్ చెబుతాడేమో చూడాలి.

User Comments