వామ్మో… బన్నీని `బే` అనేసింది

బ‌న్నీ అంటే యూత్‌కి ఓ ఐకాన్‌. స్టైలిష్ స్టార్‌గా ఆకాశ‌మంత ఎత్తున ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయ‌న సినిమాలు వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంటాయి. అలాంటి అల్లు అర్జున్‌ని ఓ అమ్మాయి బే అనేసింది. ఒక‌సారి కాదు, రెండుసార్లు కాదు. ఏకంగా మూడుసార్లు `బే` అనేసింది. న‌న్నే బే అంటావా అని అల్లు అర్జున్ అంటుంటే కూడా లెక్క‌చేయ‌కుండా మ‌ళ్లీ బే అనేసింది. అల్లు అర్జున్‌నే అలా అనేంత స్థాయి ఎవ‌రికుందంటారా? ఎవ‌రో కాదు… అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ‌. ఎంత స్టైలిష్ స్టార్ అయినా కూతురుకి తండ్రే కదా.

అందుకే అర్హ త‌న డాడీ ఇంట్లోకి రాగానే ఓ ఆట ఆడేసుకుంటుంది. మొన్నటికి మొన్న ఆయ‌న రాములో పాట కోసం వేసిన స్టెప్పుని దోసె స్టెప్ అని ఏడిపించేసింది. ఇప్పుడేమో మరో అడుగు ముందుకేసి తండ్రిని బే అనేసింది. తండ్రీ కూతుళ్లు మ‌ధ్య ఈ స‌ర‌దాలు ఫ్యాన్స్‌కి బోలెడంత సంతోషాన్నిస్తున్నాయి. అర్హ‌తో ఇలాంటి చిలిపి ఆట‌లు ఆడుతున్న‌ప్పుడు తీసిన వీడియోల్ని అల్లు అర్జున్ ఇన్‌స్ట‌గ్రామ్‌లో కానీ, ట్విట్ట‌ర్‌లో కానీ పోస్ట్ చేస్తుంటారు. ఇటీవ‌ల నీ ఫేవ‌రేట్ క‌ల‌ర్ ఏంటి బే అని స‌ర‌దాగా అర్హని అల్లు అర్జున్ అడ‌గ‌గా పింక్ బే అని రిప్లై ఇచ్చింది అర్హ‌. అలా వాళ్లు ఒక‌రినొక‌రు బే అనుకుంటూ చేసిన అల్ల‌రి నెటిజ‌న్ల‌ను భ‌లే ఆక‌ట్టుకొంటోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` విజ‌యంతో జోష్‌మీదున్న అల్లు అర్జున్ ఈ వారంలో సుకుమార్ సినిమా కోసం రంగంలోకి దిగ‌బోతున్నారు.