ఓసోసి సోనాక్షి.. అందాన్ని దాచేసి..!

Last Updated on by

సోనాక్షి సిన్హా చాలా రోజుల త‌ర్వాత క‌నిపించింది. జూన్ 2న త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు ఫోటోషూట్ తో గిఫ్ట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య కాలంలో అస‌లు బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమాలు కూడా లేకపోవ‌డంతో సోనాక్షి ఫ్యాన్స్ కు పూర్తిగా దూరం అయిపోయింది. ప్ర‌స్తుతం క‌లంక్ సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. ఇది మిన‌హా మ‌రో సినిమా లేదు. ఈ మ‌ధ్యే గ్రాజియా మ్యాగ‌జైన్ కు ఫోటో షూట్ చేసింది సోనాక్షి. సాధార‌ణంగా అందాల‌న్నీ ఆర‌బోయ‌డం కాకుండా ఈ సారి కొత్త‌గా ఆలోచించింది ఈ భామ‌. నిండా క‌ప్పుకుని సెగ‌లు రేపింది.

sonakshi sinha Grazia Magazine Cover page Photoshootచూపుల‌తోనే మ‌తులు చెడ‌గొట్టేసింది సోనాక్షి. కెరీర్ మొద‌ట్లో ఎక్స్ పోజింగ్ అంటే అంతెత్తు ఎగిరిప‌డే సోనాక్షి.. ఇప్పుడు అడ‌క్క‌పోయినా ప్ర‌తీ చోటా అందంతో అద‌ర‌గొడుతుంది. మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఆ మ‌ధ్య‌ సిడ్నీ బీచ్ లో చిట్టి నిక్క‌రు.. తొడ‌లు క‌నిపించేలా షార్టులు వేసుకుని మ‌తులు పోగొట్టింది సోనాక్షి. మొన్న‌టికి మొన్న ఫెమినా మ్యాగ‌జైన్ పై అందాలు ఆర‌బోసింది. ఇప్పుడు గ్రాజియా కోసం చూపుల‌తో చంపేస్తుంది. ఏదేమైనా చాలా రోజుల త‌ర్వాత క‌నిపించింది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments